బిజినెస్

డబ్ల్యుఇఎఫ్ 2017 యంగ్ గ్లోబల్ లీడర్స్ జాబితాలో ఐదుగురు భారతీయులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 17: ఈ ఏడాదికిగాను ప్రపంచ ఆర్థిక మండలి (డబ్ల్యుఇఎఫ్) 100 యంగ్ గ్లోబల్ లీడర్ల జాబితాలో ఐదుగురు భారతీయులకు చోటు దక్కింది. వారిలో పేటిఎమ్ వ్యవస్థాపక సిఇఒ విజయ్ శేఖర్ శర్మ, తామర హాస్పిటాలిటీ ప్రమోటర్, డైరెక్టర్ శృతీ శిబులాల్ ఉన్నారు. దేశీయ ఐటిరంగ దిగ్గజాల్లో ఒకటైన ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకుడు, దాని మాజీ సిఇఒ ఎస్‌డి శిబులాల్ కుమార్తె శృతీ శిబులాల్. కాగా, జాబితాలో స్థానం లభించిన మిగతావారి విషయానికొస్తే 1.5 బిలియన్ డాలర్ల విలువైన వ్యాపారం కలిగిన మొబైల్ యాప్.. బ్లిప్పర్ సంస్థ వ్యవస్థాపక సిఇఒ అంబరీశ్ మిత్ర, ఫార్చూన్ ఇండియా ఎడిటర్ హిందోల్ సేన్‌గుప్తా, స్వానితి ఇనీషియేటివ్ వ్యవస్థాపక సిఇఒ రిత్వికా భట్టాచార్య ఉన్నారు. దక్షిణాసియా నుంచి ఈ జాబితాలో చోటు దక్కించుకున్నవారు తొమ్మిది మంది ఉన్నారు. అమెరికా, ఐరోపాల్లోని భారత సంతతివారూ ఈ జాబితాలో ఉండగా, 40 ఏళ్లలోపు వయసున్నవారితో ఈ జాబితా తయారైంది.

చిత్రాలు..హిందోల్ సేన్‌గుప్తా * శృతీ శిబులాల్ అంబరీశ్ మిత్ర *విజయ్ శేఖర్ శర్మ * రిత్వికా భట్టాచార్య