బిజినెస్

ప్రైవేటు రంగానికి పెద్దపీట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మార్చి 17: ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రైవేటు రంగానికి ప్రాధాన్యం పెరుగుతోందని అనకాపల్లి ఎంపి అవంతి శ్రీనివాస్ అన్నారు. సిఐఐ వార్షిక సమావేశంలో భాగంగా రియలైజింగ్ విజన్ ఆఫ్ సన్‌రైజ్ ఆంధ్రప్రదేశ్ అన్న అంశంపై శుక్రవారం విశాఖలో సదస్సు జరిగింది. ఈ సదస్సులో అవంతి శ్రీనివాస్ ప్రత్యేక ఉపన్యాసం చేస్తూ పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గణనీయమైన కృషి చేస్తున్నాయని చెప్పారు. కొత్త పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే పలు దేశాల్లో పర్యటించారని గుర్తుచేశారు.
అయతే కొత్త పరిశ్రమలను ప్రోత్సహించడంతోపాటు, ఉన్న పరిశ్రమల బాగోగులను కూడా ప్రభుత్వాలు పట్టించుకోవాలని కోరారు. విద్యుత్ బిల్లులు చెల్లించలేక ఫెర్రో అల్లారుూస్ కంపెనీలు మూతపడుతున్న నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగులేకపోయినా.. పవర్ టారీఫ్‌ను తగ్గించి, ఆ పరిశ్రమలను చంద్రబాబు ఆదుకున్నారని తెలిపారు. అలాగే బ్రాండిక్స్ కంపెనీలో తలెత్తిన సమస్యను కూడా ఆయన సునాయాసంగా పరిష్కరించారని ఎంపి శ్రీనివాస్ గుర్తు చేశారు. కాగా, కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి నిబంధనలు, అనుమతులు ఇబ్బందికరంగా మారాయని, వాటిని సరళతరం చేయాలని ఎంపి విజ్ఞప్తి చేశారు. బ్రిటిష్ హై కమిషనర్ అభిలాష్ పుజాకర్ మాట్లాడుతూ దేశంలోని స్మార్ట్ సిటీలు రోజు రోజుకూ పెరుగుతున్నాయని, వీటిలో సాంకేతిక వినియోగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. అమరావతి నిర్మాణంలో యుకే కీలక పాత్ర పోషించనుందని ఆయన తెలిపారు. సిఐఐ మేనేజింగ్ పార్ట్నర్ కాళీప్రసాద్ మాట్లాడుతూ వచ్చే పదేళ్లలో దేశంలో మొదటి మూడు రాష్ట్రాల్లో ఒకటిగా ఏపిని ఉంచాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. 2020 నాటికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయని ఆయన చెప్పారు. 2030 నాటికి దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా ఏపిని చేయాలనుకోవడంలో తప్పులేదు కానీ, అందుకు తగిన ఆర్థిక వృద్ధి కూడా సాధించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని కాళీ ప్రసాద్ అభిప్రాయపడ్డారు. వచ్చే 13 సంవత్సరాల్లో ఏపి ఒక ట్రిలియన్ జిఎస్‌డిపి సాధించాలని ఆయన చెప్పారు. ఇందుకోసం ప్రభుత్వం చేపడుతున్న వివిధ కార్యక్రమాల్లో వాస్తవికత ఎంత ఉందన్నది తెలుసుకోవాలని సూచించారు. సిఐఐ సదరన్ రీజియన్ చైర్మన్ రమేష్ దాట్ల మాట్లాడుతూ రాష్ట్ర విభజన అనంతరం అనేక సమస్యలను ఎదుర్కొంటున్నామని, ఇది అభివృద్ధిపై దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపుతోందన్నారు. పారిశ్రామికాభివృద్ధికి సిఐఐ.. ప్రభుత్వంతో కలిసి పనిచేస్తోందని చెప్పారు. ఇంజనీరింగ్ విద్యను పూర్తి చేసుకున్న వారు ఏటేటా పెరిగిపోతున్నారన్నారు. ఈ సమావేశంలో ఏపి స్టేట్ ప్లానింగ్ బోర్డ్ మెంబర్ సెక్రటరీ బి గంగయ్య రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యం అంశాల గురించి వివరించారు. సమావేశానికి సిఐఐ ఏపి చైర్మన్ జిఎస్ శివకుమార్ అధ్యక్షత వహించారు.
మహిళలు తలచుకుంటే ఏదైనా సాధిస్తారు: జయేష్ రంజన్
హైదరాబాద్: మీరు చైతన్యవంతులు కావాలి, ఇతరులను చైతన్యవంతం చేయాలని మహిళా పారిశ్రామికవేత్తల సమావేశంలో తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యశాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ పిలుపునిచ్చారు. భారతీయ పరిశ్రమల సమాఖ్య (సిఐఐ) అనుబంధ విభాగం ఇండియన్ ఉమెన్ నెట్‌వర్క్ (ఐడబ్ల్యూఎన్) హైదరాబాద్ చాప్టర్ తన వార్షికోత్సవం సందర్భంగా శుక్రవారం నాడిక్కడ ‘మహిళా సాధికారత, పెరుగుదల, భవిష్యత్ భద్రత’ అనే అంశంపై సమావేశం నిర్వహించింది.
సమావేశాన్ని ప్రారంభించిన జయేష్ రంజన్ మాట్లాడుతూ మహిళలు ఏదైనా సాధించాలనుకుంటే సాధించి తీరుతారన్నారు. ఈ సమావేశం ద్వారా వృత్తి నిపుణులైన మహిళలు సామాజిక, ఆర్థిక భద్రత అంశాల్లో మరింత చైతన్యవంతం అవుతారని తెలిపారు. మీరు చైతన్యవంతం కావడమే కాకుండా ఇతరులను చైతన్యవంతులను చేసేందుకు తోడ్పడతారని కొనియాడారు. ఈ సమావేశంలో మార్గదర్శి గ్రూప్ ఎండి శైలజా కిరణ్ కీలకోపన్యాసం చేశారు. పని చేసే చోట మహిళలు తమ చుట్టూ ఉన్న వారిని, సహ ఉద్యోగులతో కలిసి పని చేస్తూ వారిని కలుపుకుపోయే ధోరణిని అలవర్చుకోవాలని సూచించారు. తద్వారా అనుకున్న లక్ష్యం సాధించగలుగుతారన్నారు. ఐడబ్ల్యూఎన్ జాతీయ అధ్యక్షురాలు సుచిత్రా ఎల్లా మాట్లాడుతూ మహిళా పారిశ్రామికవేత్తలకు, మహిళలకు కెరీర్ పరంగా కావాల్సిన సహకారం అందించేందుకు ఉమెన్ నెట్‌వర్క్ వేదికగా పని చేస్తోందన్నారు. ఇంకా పలు రంగాలకు చెందిన మహిళా ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

చిత్రాలు..విశాఖ సదస్సులో మాట్లాడుతున్న రమేష్ దాట్ల, ఐడబ్ల్యూఎన్ హైదరాబాద్ చాప్టర్ వార్షికోత్సవ ప్రారంభదృశ్యం