బిజినెస్

ఆల్‌టైమ్ హైకి నిఫ్టీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మార్చి 17: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ముగిశాయి. నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 6.35 పాయింట్లే పెరిగినా.. మునుపెన్నడూ లేనివిధంగా సరికొత్త స్థాయిలో 9,160.05 వద్ద నిలిచింది. ఒక దశలో ఇంట్రా-డే ట్రేడింగ్‌లో 9,200 మార్కును దాటిన నిఫ్టీ.. గరిష్ఠంగా 9,218.40 స్థాయిని చేరింది. మరోవైపు బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 63.14 పాయింట్లు అందుకుని 29,648.99 వద్ద స్థిరపడింది. వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి)ను ఈ ఏడాది జూలై నుంచి అమల్లోకి తీసుకురావాలని కేంద్రం భావిస్తున్న నేపథ్యంలో పార్లమెంట్, రాష్ట్రాల అసెంబ్లీలోకి జిఎస్‌టిని పంపేందుకు చేస్తున్న సన్నాహాలు మార్కెట్ సెంటిమెంట్‌ను పెంచాయి. సిగరెట్లు తదితర పొగాకు ఉత్పత్తులపై సెస్సు విషయంలో జిఎస్‌టి కౌన్సిల్ సానుకూలంగా నిర్ణయాలు తీసుకోవడంతో ఎఫ్‌ఎమ్‌సిజి షేర్లు లాభపడ్డాయి. 2.41 శాతం మేర పుంజుకున్నాయి. వి ఎస్‌టి ఇండస్ట్రీస్ షేర్ విలువ 7.55 శాతం పెరిగితే, ఐటిసి షేర్ విలువ 4.85 శాతం, గాడ్రే ఫిలిప్స్ షేర్ విలువ 1 శాతం మేర ఎగబాకింది. రియల్టీ, ఐటి, టెక్నాలజీ రంగాల షేర్లూ మదుపరులను ఆకర్షించాయి. మరోవైపు ఆసియా మార్కెట్లలో కీలక సూచీలు నష్టాల్లో కదలాడగా, ఐరోపా మార్కెట్లలో ప్రధాన సూచీలు మిశ్రమంగా స్పందించాయి. ఇదిలావుంటే ఈ వారం మొత్తంగా సెనె్సక్స్ 702.76 పాయింట్లు పెరిగితే, నిఫ్టీ 225.50 పాయింట్లు ఎగబాకింది.