బిజినెస్

ప్రభుత్వం కేటాయించిన గ్యాస్‌తో ఎన్‌ఎఫ్‌సిఎల్ యూరియా ఉత్పత్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, మార్చి 17: ఎరువుల ఉత్పత్తిలో పేరొందిన నాగార్జున ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఎన్‌ఎఫిసిఎల్) కాకినాడ కర్మాగారాన్ని విక్రయించే ఉద్దేశం ఎంతమాత్రం లేదని, దీనిపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని ఆ సంస్థ యాజమాన్యం శుక్రవారం ఇక్కడ విడుదల చేసిన ప్రకటనలో స్పష్టం చేసింది. కంపెనీకిగాని, మెజారిటీ వాటాదారులకు (ప్రమోటర్స్)గాని సంస్థను అమ్మే ఉద్దేశం లేదని యాజమాన్యం పేర్కొంది. అన్ని నియమాలను సంస్థ కచ్చితంగా పాటిస్తోందని, ఇందుకు సంబంధించి ఇటీవల స్టాక్ ఎక్స్చేంజ్‌కు సవివరమైన ప్రకటన కూడా ఇచ్చామని, ఆ ప్రకటన స్టాక్ ఎక్స్చేంజ్‌కు సంబంధించిన వెబ్‌సైట్‌లో ఉందని యాజమాన్యం తెలిపింది. తమ కంపెనీకి యూరియాతోపాటు అనేక వ్యాపారాలున్నాయని, గతంలో గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా (గెయిల్) పైపులైన్‌లో ప్రమాదం సంభవించిన నేపథ్యంలో గ్యాస్ కొరత కారణంగా వ్యాపారంలో సంస్థ ఒడిదుడుకులను ఎదుర్కొందని, అయితే సత్వర చర్యల ద్వారా నష్టాలను తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నట్టు పేర్కొంది. ప్రభుత్వం నూతనంగా కేటాయించిన గ్యాస్‌తో యూరియా ఉత్పత్తిని పునఃప్రారంభించామని, షేర్ హోల్డర్ల ప్రయోజనాలకై అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని సంస్థ యాజమాన్యం ప్రకటనలో స్పష్టం చేసింది.