బిజినెస్

2జి, 3జి, 4జి.. ఏదైనాసరే ఇకపై ఒకే ధర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 17: దేశీయ టెలికామ్ రంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ రాక ఈ మార్పులకు నాంది పలకగా, మిగతా సంస్థలు వాటిని కొనసాగిస్తున్నాయి. ఇప్పటికే ఇన్‌కమింగ్ కాల్స్‌పై నేషనల్ రోమింగ్‌ను ఎత్తివేసిన ప్రముఖ టెలికామ్ సంస్థలు.. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కాల్స్, డేటా చార్జీలనూ గణనీయంగా తగ్గించినది తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పుడు ఐడియా సెల్యులార్.. 2జి, 3జి, 4జి నెట్‌వర్క్‌ల్లోని మొబైల్ డేటా ప్లాన్లన్నింటికీ ఒకే ధరను ప్రకటించింది. 1జిబి, అంతకుమించి మొబైల్ డేటా ప్లాన్ల ధరలన్నీ ఒకేలా ఉంటాయని స్పష్టం చేసింది. ఈ నెల 31 నుంచి ఈ కొత్త ధరలు అమల్లోకి వస్తాయని శుక్రవారం ఓ ప్రకటనలో ఐడియా సెల్యులార్ తెలిపింది. ప్రస్తుతం ఐడియా మొబైల్ ఇంటర్నెట్ ప్లాన్ల ధరలు వేర్వేరుగా ఉన్నాయి. అయితే రిలయన్స్ జియో నుంచి మార్కెట్‌లో ఎదురవుతున్న గట్టిపోటీ నేపథ్యంలో 2జి సేవల కంటే కూడా 4జి సేవల ధరలు తక్కువకు పడిపోయాయి. నెల రోజుల కాలపరిమితి కలిగిన 1జిబి 2జి డేటా ధర దాదాపు 170 రూపాయలుగా ఉంటే, 4జి డేటా ధర 123 రూపాయలే. ఇంతకుముందు డౌన్‌లోడ్ వేగం ఆధారంగా ధరలుండేవి. వేగం పెరిగినకొద్దీ ధరలూ పెరిగేవి. అయితే ఇప్పుడు నెట్‌వర్క్ శ్రేణి ఏదైనా ధరలు మాత్రం ఒకేలా ఉంటాయని, కస్టమర్‌కున్న స్మార్ట్ఫోన్ సామర్థ్యం ఆధారంగా 2జి, 3జి, 4జి డేటా ప్యాక్‌లను ఎంచుకోవచ్చని ఐడియా సెల్యులార్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ శశి శంకర్ తెలిపారు. దశలవారీగా మే 31కల్లా దేశవ్యాప్తంగా అన్ని సర్కిళ్లలో ఒకే ధరలతో డేటా చార్జీలుంటాయన్నారు. ధరల వ్యత్యాసం గురించిన ఆందోళన లేకుండా వినియోగదారులు తమకు నచ్చిన నెట్‌వర్క్ శ్రేణిని వినియోగించుకోవచ్చని శంకర్ చెప్పారు. దీంతో చాలామంది మొబైల్ వినియోగదారులు.. 2జి నుంచి 4జికి మారే అవకాశాలున్నాయన్నారు. దేశవ్యాప్తంగా 4 లక్షల పట్టణాలు, గ్రామాల్లో 2జి నెట్‌వర్క్‌ను ఐడియా కలిగి ఉంది. బ్రిటన్‌కు చెందిన టెలికామ్ దిగ్గజం వొడాఫోన్‌తో విలీన చర్చలను ఐడియా జరుపుతున్నదీ తెలిసిందే. ఐడియా సెల్యులార్‌లో వొడాఫోన్ ఇండియా విలీనమైతే కస్టమర్లు, నెట్‌వర్క్ ఆధారంగా దేశంలోనే అతిపెద్ద టెలికామ్ సంస్థగా అవతరించనుంది. కాగా, జియో ఉచిత డేటా ఆఫర్ ఈ నెల 31తో ముగుస్తున్నది తెలిసిందే. ఆ తర్వాత నుంచి 300 రూపాయలకు ఇప్పుడున్న డేటా ప్యాక్‌ను పొందవచ్చు. ఈ క్రమంలో ఎయిర్‌టెల్ కూడా డేటా ప్లాన్ల ధరలను తగ్గిస్తుండగా, ఇప్పుడు ఐడియా కూడా అదే బాటలో నడుస్తోంది. ప్రభుత్వరంగ టెలికామ్ సంస్థ బిఎస్‌ఎన్‌ఎల్ కూడా డేటా చార్జీలను గణనీయంగా తగ్గించినది తెలిసిందే.