బిజినెస్

విద్యుదుత్పత్తిలో ఎన్టీపీసీ దూకుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోదావరిఖని, మార్చి 18: విద్యుదుత్పత్తిలో ఎన్టీపీసీ ఎప్పుడూ రారాజుగానే నిలుస్తోంది. ఎన్టీపీసీ విద్యుత్ సంస్థలు ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు ఉత్పత్తిలో అనేక రికార్డులను తమ ఖాతాలో జమ చేసుకున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న విద్యుత్ సంస్థల్లో ఎన్టీపీసీ ప్రతీసారి అగ్ర భాగాన నిలుస్తోంది. తాజాగా ఈ నెల 16 నాటికి 263.95 బిలియన్ యూనిట్లతో విద్యుదుత్పత్తిని సాధించి సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది. నిరుడు రికార్డును ఈ సంవత్సరంలో 15 రోజుల ముందే సాధించి చరిత్రను తిరగరాసింది. వంద శాతానికిపైగా పిఎల్‌ఎఫ్ సాధించి విద్యుదుత్పత్తిని చేస్తోంది. అలాగే దేశవ్యాప్తంగా ఉన్న ఎన్టీపీసీ విద్యుత్ సంస్థల్లో 29 యూనిట్లు 95 శాతం పిఎల్‌ఎఫ్‌తో ఉత్పత్తి జరుపుతున్నాయి. ఈ సంవత్సరం 5 శాతం అధికంగా పవర్ జనరేషన్ సాధించేలా ఎన్టీపీసీ సంస్థ అడుగులు వేస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న ఎన్టీపీసీ విద్యుత్ సంస్థల్లో ఒకటైన 4,760 మెగవాట్ల విద్యాంచల్ స్టేషన్‌లో ప్రస్తుతం 114.25 శాతం పిఎల్‌ఎఫ్‌తో ఉత్పత్తి దూసుకుపోతోంది. ఇది ఇలాఉండగా వౌడా సొలార్ యూనిట్లలో కూడా విద్యుదుత్పత్తి గరిష్ఠ స్థాయిలో జరుగుతోంది.