బిజినెస్

విదేశీ వాటాను అమ్మేసిన విఇ కమర్షియల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 18: తమ అమెరికా ఆధారిత అనుబంధ సంస్థలో మొత్తం వాటాను విఇ కమర్షియల్ వెహికిల్స్ ఉపసంహరించుకుంది. స్పెయిన్‌కు చెందిన సెగులా టెక్నాలజియస్ ఎస్పనాకు ఈ వాటాను 1.85 మిలియన్ డాలర్లకు అమ్మేసింది. ఐషర్ మోటార్స్, వోల్వో గ్రూప్ జాయింట్ వెంచరే ఈ విఇ కమర్షియల్ వెహికిల్స్. 50:50 నిష్పత్తితో ఈ వాణిజ్య వాహన జాయింట్ వెంచర్‌ను ఐషర్, వోల్వో కలిసి ఏర్పాటు చేశాయి. ఐషర్ ఇంజినీరింగ్ సొల్యూషన్స్‌లోని 100 శాతం వాటాను ఎస్పనా కొనుగోలు చేసిందని ఓ ప్రకటనలో శనివారం విఇ కమర్షియల్ వెహికిల్స్ పేర్కొంది. కాగా, ఈ నిధులతో భారతీయ వాణిజ్య రవాణాలో సంస్థను మరో మెట్టు ఎక్కిస్తామని ఎండి, సిఇఒ వినోద్ అగర్వాల్ తెలిపారు.