బిజినెస్

లీకుల ఆరోపణలు అబద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 18: కస్టమర్లకు సంబంధించిన క్రెడిట్ కార్డు వివరాలు, వాలెట్ల పాస్‌వర్డ్‌లు లేదా బ్యాంక్ ఖాతా సమాచారం తదితర రహస్య ఆర్థిక డేటాను ఎట్టి పరిస్థితుల్లోనూ తమ వెబ్‌సైట్, యాప్ భద్రపరచుకోవని ఫాస్ట్ఫుడ్ దిగ్గజం మెక్‌డొనాల్డ్స్ స్పష్టం చేసింది. 22 లక్షలకుపైగా కస్టమర్ల వ్యక్తిగత ఆర్థిక వివరాలను మెక్‌డొనాల్డ్స్ బహీర్గతపరిచిందన్న ఆరోపణలపై పైవిధంగా స్పందించింది. ఇదంతా నిరాధారమంటూ ఓ ప్రకటనలో శనివారం మెక్‌డొనాల్డ్స్ ఇండియా (పశ్చిమ, దక్షిణ) అధికార ప్రతినిధి తెలిపారు.
2.2 మిలియన్లకుపైగా కస్టమర్ల వ్యక్తిగత వివరాలను మెక్‌డొనాల్డ్స్ ఇండియా యాప్ అయిన మెక్‌డెలివరీ లీక్ చేసిందని శుక్రవారం హాకర్‌నూన్ అనే ఓ స్వతంత్ర బ్లాగ్‌పోస్ట్‌లో వచ్చింది. కస్టమర్ల పేరు, ఈ-మెయిల్, నివాస చిరునామాలతోపాటు వారి ఫోన్ నెంబర్లు ఇతరత్రా సామాజిక వెబ్ వేదిక వినియోగం వివరాలను మెక్‌డెలివరీ వెల్లడించిందంటూ పోస్ట్ చేశారు. దీన్ని ఖండించిన మెక్‌డొనాల్డ్స్.. తమ వెబ్‌సైట్, యాప్ వినియోగం ఎల్లప్పుడు సురక్షితమేనని స్పష్టం చేసింది. అయినప్పటికీ కస్టమర్లు తమతమ మొబైల్స్‌లో మెక్‌డెలివరీ యాప్‌ను అప్‌డేట్ చేసుకోవాలని కూడా సంస్థ ఈ సందర్భంగా సూచించింది. అయితే ఇది ముందస్తు భద్రతా చర్యల్లో భాగం మాత్రమేనని తెలిపింది.