బిజినెస్

ఈక్విటీ మార్కెట్లలో మరో 15 శాతం ఇపిఎఫ్‌ఓ పెట్టుబడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 19: దేశీయ స్టాక్ మార్కెట్లు అభివృద్ధి పథంలో పయనిస్తుండటంతో ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఇపిఎఫ్‌ఓ) పెట్టుబడులు పెట్టదగిన మొత్తంలో 15 శాతం మేరకు నిధులను వచ్చే ఆర్థిక సంవత్సరం ఈక్విటీ మార్కెట్లలో పెట్టాలని యోచిస్తోంది. కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ ఆదివారం ఈ విషయాన్ని వెల్లడించారు. ‘వచ్చే ఆర్థిక సంవత్సరంలో 15 శాతం మేరకు నిధులను ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడిగా పెట్టాలని మేము యోచిస్తున్నాం. ఈ నెల 30వ తేదీన జరిగే ఇపిఎఫ్ కేంద్ర ట్రస్టు బోర్డు సభ్యుల సమావేశంలో దీనిపై అభిప్రాయాన్ని తీసుకుంటాం. గత ఏడాదిన్నర కాలంలో మేము ఈక్విటీ మార్కెట్లలో రూ.18,069 కోట్ల పెట్టుబడులు పెట్టి ప్రోత్సాహకరమైన ఫలితాలను సాధించాం’ అని దత్తాత్రేయ పిటిఐ వార్తా సంస్థకు వివరించారు. దేశంలోని ప్రధాన స్టాక్ మార్కెట్లయిన బిఎస్‌ఇ సెనె్సక్స్, ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీల్లోని ఎక్స్‌చేంజి ట్రేడెడ్ ఫండ్స్ (ఇటిఎఫ్)లో ఇపిఎఫ్‌ఓ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఫండ్ మేనేజర్ల ద్వారా ఇప్పటివరకూ పెట్టిన రూ.14,700 కోట్ల పెట్టుబడులకు 18.13 లాభాలు వచ్చాయని ఆయన చెప్పారు. ఇపిఎఫ్‌ఓ పెట్టుబడులు పెట్టదగిన మొత్తంలో ప్రతి సంవత్సరం 5 నుంచి 15 నిధులను ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడులుగా పెట్టేందుకు ఆర్థిక మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చిందని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఇప్పటికే వివిధ సంస్థల్లో పెట్టిన పెట్టుబడుల ద్వారా ఇపిఎఫ్‌ఓకి వచ్చే ఆదాయంతో పాటు తాజాగా వచ్చే చందాలను పెట్టుబడులు పెట్టదగిన మొత్తంగా పరిగణిస్తున్నారు. 8 లక్షల కోట్ల రూపాయలకు పైగా మూలనిధికి మేనేజర్‌గా వ్యవహరిస్తున్న ఇపిఎఫ్‌ఓ 2015 ఆగస్టు నుంచి ఇటిఎఫ్‌లలో పెట్టుబడులు పెడుతున్న విషయం తెలిసిందే.