బిజినెస్

దళారుల ప్రమేయం లేకుండా నేరుగా వజ్రాల వ్యాపారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మార్చి 19: వజ్రాల వ్యాపారంలో మధ్యవర్తుల ప్రమేయం లేకుండా భారత్‌తో నేరుగా సంబంధాలను ఏర్పాటు చేసుకోవాలని యోచిస్తున్నట్లు జింబాబ్వే ప్రభుత్వం ప్రకటించింది. ‘మా దేశంలో గనుల నుంచి వెలికితీసిన వజ్రాలను భారత్ ఇప్పటివరకూ మధ్యవర్తుల ద్వారా దిగుమతి చేసుకుంటోంది. వ్యాపారంలో మధ్యవర్తుల ప్రమేయాన్ని తొలగించి వజ్రాల సరఫరా జోరుగా సాగేందుకు నేరుగా సంబంధాలు ఏర్పాటు చేసుకోవాలని భారత్, జింబాబ్వే భావిస్తున్నాయి. దీని వలన ఇరు దేశాల్లో వజ్రాల పరిశ్రమకు మరింత ఊతం లభిస్తుంది’ అని జింబాబ్వే గనుల శాఖ మంత్రి వాల్టర్ చిదాక్వా తెలిపారు. వజ్రాల వ్యాపారంపై అంతర్జాతీయ సదస్సులో పాల్గొనేందుకు న్యూఢిల్లీ వచ్చిన ఆయన పిటిఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో తాను కేంద్ర గనుల శాఖ సహాయ మంత్రి పియూష్ గోయల్‌తో భేటీ అయ్యానని, ఆయన కూడా ఇదేవిధమైన అభిప్రాయాలను వ్యక్తం చేయడంతో పాటు సంపూర్ణ తోడ్పాటు అందజేస్తామని హామీ ఇచ్చారని చిదాక్వా చెప్పారు. వజ్రాల తయారీని పెంచేందుకు తమకు నిపుణులైన కార్మికుల అవసరం ఎంతో ఉందని, కనుక ఈ విషయంలో భారత్ తమకు తోడ్పాటును అందజేస్తుందని ఆశిస్తున్నామని ఆయన తెలిపారు. కేంద్ర వ్యాపార, నైపుణ్య అభివృద్ధి శాఖ మంత్రి రాజీవ్ ప్రతాప్ రూడీతో త్వరలో సమావేశమై వజ్రాల తయారీ రంగంలో నైపుణ్యతను అభివృద్ధి చేసుకునేందుకు భారత్ తమకు ఏవిధంగా తోడ్పాటును అందజేయగలదన్న విషయంపై చర్చిస్తానని, తమ దేశంలో కొత్త ఉపాధి అవకాశాలను సృష్టించేందుకు ఇది ఎంతగానో దోహదపడుతుందని చిదాక్వా వివరించారు.