బిజినెస్

మైక్రో ఫైనాన్స్ సంస్థలను క్రమబద్దీకరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 20: రైతులకు ఎక్కువ వడ్డీకి రుణాలు ఇస్తూ తమ పబ్బం గడుపుకుంటున్న మైక్రో ఫైనాన్స్ కంపెనీలను క్రమబధ్దీకరించాలని వైఎస్‌ఆర్‌సిపి లోక్‌సభ సభ్యురాలు బుట్టా రేణుక డిమాండ్ చేశారు. సోమవారం లోక్‌సభలో సప్లిమెంటరీ డిమాండ్లపై మాట్లాడుతూ చివరకు సూక్ష్మరుణ సంస్థలు కూడా రైతుల నుండి అధిక వడ్డీ వసూలు చేయటం అన్యాయమని విమర్శించారు. వాణిజ్య బ్యాంకులను క్రమబద్దీకరించినట్లు మైక్రో ఫైనాన్స్ కంపెనీలను కూడా క్రమబద్దీకరించాలని డిమాండ్ చేశారు. పాత పెద్దనోట్ల రద్దు లాంటి మరిన్ని విప్లవాత్మక నిర్ణయాలు తీసుకోవాలని ఆమె ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కోరారు. అయతే ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నా రైతుల పరిస్థితి ఏ మాత్రం మారటం లేదని ఆమె వాపోయారు. రైతులకు కరువు సహాయం అందకపోవటం బాధాకరమన్నారు. ప్రభుత్వం పంటల కనీస మద్దతు ధరను పెంచినప్పటికీ, అది ఏ మాత్రం సరిపోదని స్పష్టం చేశారు. రైతులకు అందవలసిన ప్రయోజనాలను మధ్యవర్తులు, కార్పొరేట్ సంస్థలు తన్నుకుపోతున్నాయని, దీనిని అరికట్టాలని ఆమె ఎన్‌డిఎ ప్రభుత్వాన్ని కోరారు. తాను ప్రాతినిథ్యం వహిస్తున్న కర్నూలు లోక్‌సభ నియోజకవర్గంలో కరువు తాండవం చేస్తోందని, రైతులు పలు సమస్యలను ఎదుర్కొంటుంటే వ్యవసాయ కూలీలు పొట్టపోసుకునేందుకు ఇతర ప్రాంతాలకు వలస పోతున్నారని రేణుక చెప్పారు. చేనేత కార్మికుల పరిస్థితి ఎంత మాత్రం బాగా లేదంటూ కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని తగు చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. జౌళి పరిశ్రమను ఆధునీకీకరించిన తరువాత చేనేత కార్మికుల పరిస్థితి మరింత దుర్భరంగా తయారైందన్నారు. కాగా, ప్రత్యేక హోదా ఇస్తామంటూ పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకోవాలని ఆమె కోరారు.