బిజినెస్

అట్టపెట్టెల కంపెనీలను ఆదుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 20: తెలంగాణ రాష్ట్రంలో 80 వేల మందికి ఉపాధి కల్పిస్తున్న 2,500 అట్టపెట్టెల కంపెనీలను ఆదుకోవాలని ఈ కంపెనీల యజమానులు ప్రభుత్వాన్ని కోరారు. అట్టపెట్టెల తయారీదారుల సంఘం ప్రతినిధులు ఆదిత్య శర్మ, సాగర్‌గాల, ఎంఎల్ అగర్వాల్, ఎంవిఎం భరత్ తదితరులు ఎఫ్‌టాప్సి ఆడిటోరియంలో సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. స్వయం ఉపాధికోసం చిన్నతరహా పరిశ్రమల్లో భాగంగా అట్టపెట్టెల తయారీ కంపెనీలను ఏర్పాటు చేసుకున్నామని వారు తెలిపారు. ఒక్కో కంపెనీలో 25 నుండి 30 మంది వరకు పనిచేస్తున్నారని చెప్పారు. అట్టపెట్టెలకు అవసరమైన ముడిసరకు సరఫరా చేసే ఉత్పత్తిదారులు గత ఆరు నెలల నుండి కాగితం ధరలను తరచూ పెంచుతున్నారని ఆరోపించారు. ఆరు నెలల క్రితం కిలో ముడి కాగితం ధర 22.30 రూపాయలు ఉండగా, ఇప్పుడు అది 30 రూపాయలైందన్నారు. కృత్రిమంగా ధర పెంచేందుకు గత 45 రోజుల నుండి ముడి కాగితం దొరకకుండా దాని తయారీదారులు చేస్తున్నారని, తమకు సరఫరా చేయడం లేదని ఆరోపించారు. తమకు ముడిసరకు అందకపోతే తమ కంపెనీలను మూసివేయాల్సి వస్తుందని, కార్మికులంతా రోడ్డున పడతారని పేర్కొన్నారు. కాగితం ముడిసరకు సరఫరా చేసే కంపెనీలు ధరలను పెంచిన ప్రతిసారీ, తాము అట్టపెట్టెల వినియోగదారులపై ఈ భారం వేయలేని పరిస్థితి ఏర్పడు తోంన్నారు. నెలకు దాదాపు 35 వేల టన్నుల ముడి కాగితాన్ని తాము అట్టపెట్టెల కోసం వినియోగిస్తామని వివరించారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని, తాము ఎదుర్కొంటున్న సమస్యను పరిష్కరించాలని అసోసియేషన్ ప్రతినిధులు కోరారు.

చిత్రం..విలేఖరుల సమావేశంలో ప్లకార్డులతో అట్టపెట్టెల తయారీదారులు