బిజినెస్

బ్యాంకు ఖాతాలన్నింటికీ ఆధార్ సీడింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 20: నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడానికి బ్యాంక్ ఖాతాలన్నింటినీ ఆధార్ సీడింగ్ చేయాలని సంబంధిత అధికారులను తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి సింగ్ ఆదేశించారు. నగదు రహిత లావాదేవీలపై సచివాలయంలో సోమవారం ఆర్థిక శాఖ, బ్యాంకర్లతో ఎస్‌పి సింగ్ సమావేశం నిర్వహించారు. నగదు రహిత లావాదేవీల టాస్క్ఫోర్స్ కమిటీలో ఐటి అధికారులను కూడా చేర్చాలని ఆయన సూచించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 4 లక్షల 30 వేల సేవింగ్ బ్యాంక్ అకౌంట్లు ఉండగా, వాటిలో 2.22 లక్షల ఖాతాలు ఆధార్‌తో సీడింగ్ చేశారన్నారు. మొబైల్ ద్వారా 3.07 లక్షల ఖాతాలు సీడింగ్ అయ్యాయని తెలిపారు. రాష్టవ్య్రాప్తంగా 3.04 లక్షల రూపే కార్డులు జారీ చేయగా, 2.30 లక్షల కార్డులు ఆక్టివేట్ అయ్యాయని చెప్పారు. మిగతా కార్డులను త్వరగా యాక్టివేట్ చేయాలని బ్యాంకర్లను సిఎస్ కోరారు. ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన ఖాతాలు రాష్ట్రంలో 88 లక్షల 62 వేలు ఉండగా వీటిలో 71 లక్షల 52 వేల ఖాతాలు ఆధార్ సీడింగ్ జరిగిందన్నారు. అలాగే 74 లక్షల మందికి రూపే కార్డులు జారీ చేశారన్నారు. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి పథకం కింద పని చేస్తోన్న 21.36 లక్షల మంది కూలీల ఖాతాలకుగాను 19.89 లక్షల మంది కూలీల ఖాతాల ఆధార్ సీడింగ్ పూర్తి అయిందన్నారు. డిజిటల్ లావాదేవీల నిర్వహణపై జిల్లాల వారీగా వివరాలు ప్రభుత్వానికి అందజేయాలని సిఎస్ ఆదేశించారు. సిద్దిపేట జిల్లాను వంద శాతం నగదు రహిత లావాదేవీల జిల్లాగా మార్చడానికి కృషి చేస్తున్నామన్నారు. బ్యాంకింగ్ లావాదేవీలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి బ్యాంకింగ్ కరస్పాండెంట్లు చురుకుగా పని చేయాలన్నారు. వాణిజ్య కార్యకలాపాలను ఈ-మోడ్ విధానంలోకి మార్చాలన్న ఆయన నగదు రహిత లావాదేవీలను రేషన్ షాపులలోనూ నిర్వహించేందుకు స్ర్తినిధి కో-ఆర్డినేటర్లు, ఈ-సేవ ఆపరేటర్ల సేవలను వినియోగించుకోవాలని యోచిస్తున్నట్టు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన టి-వాలెట్‌ను బ్యాంక్‌లతో అనుసంధానం చేయాలని యోచిస్తున్నట్టు సిఎస్ వెల్లడించారు. హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, కరీంనగర్‌లలో డిజి ధన్ మేళాలు నిర్వహించాలని సిఎస్ సింగ్ ఆదేశించారు.