బిజినెస్

ఖాయలా పరిశ్రమలను పునరుద్ధరిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 20: సిర్పూర్-కాగజ్‌నగర్ పేపరు మిల్లుసహా ఖాయిలాపడిన పరిశ్రమలను పునరుద్ధరించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ పురపాలక, ఐటి శాఖల మంత్రి కె తారకరామారావు స్పష్టం చేశారు. అటవీ, బిసి సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న, సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్పలతో కలిసి బ్యాంకర్లు, పారిశ్రామికవేత్తలతో మంత్రి కెటిఆర్ సోమవారం సచివాలయంలో సమావేశం నిర్వహించారు. గత పాలకుల వల్లే సిర్పూర్ మిల్లు మూతపడిందని మంత్రి ఆరోపిస్తూ దాదాపు రెండున్నర వేల మంది కార్మికులకు ఉపాధి లేకుండా పోయిందన్నారు. ఖాయిలా పరిశ్రమలకు రాయితీలు కల్పించి వాటిని పునరుద్దరించేందుకు తమ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని స్పష్టం చేశారు. బ్యాంకులు, పారిశ్రామికవేత్తలకు అవసరమైన పూర్తి సహాయ సహకారాలు ప్రభుత్వం అందిస్తుందని చెప్పారు. సిర్పూర్ మిల్లు పునరుద్ధరణకు అవసరమైన సిబ్బంది, నీరు, ముడి సరుకుతోపాటు అన్ని సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. మిషన్ భగీరథ నుంచి కర్మాగారానికి అవసరమైన నీటిని అందించేందుకూ సిద్ధంగా ఉన్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ సందర్భంగా బ్యాంకర్లు, పారిశ్రామికవేత్తలు అడిగిన పలు సందేహాలను మంత్రి నివృత్తి చేశారు. సమావేశంలో పరిశ్రమలు, ఐటి శాఖ కార్యదర్శి జయేష్ రంజన్, ఐటి, జికె పేపర్ మిల్లు కంపెనీల ప్రతినిధులు, బ్యాంకర్ల ప్రతినిధులు పాల్గొన్నారు.