బిజినెస్

పొగాకు సాగుదారులకు సహేతుకమైన జిఎస్‌టి అమలు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 20: పొగాకు సాగుదారులకు సహేతుకమైన వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి)ను అమలు చేయాలని ఫెడరేషన్ ఆఫ్ ఆలిండియా ఫార్మర్స్ అసోసియేషన్ (ఫైసా) కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. చాల పరిశ్రమలు జిఎస్‌టిని స్వాగతించి అమలు కోసం ఆశగా ఎదురు చూస్తుంటే, పొగాకు రైతులు మాత్రం చాలా ఆందోళనతో ఉన్నారని, జిఎస్‌టి తమ జీవితాలను ఛిద్రం చేసే అవకాశం ఉందని ఫైసా జనరల్ సెక్రటరీ మురళిబాబు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ పొగాకును జిఎస్‌టిలో అత్యధిక శ్లాబ్ అయిన 28 శాతం విభాగంలో చేరిస్తే ఈ విభాగంపై ప్రస్తుతం విధిస్తున్న వ్యాట్‌లో రెండు అంకెల స్థాయిని పెంచినట్లు అవుతుందని తెలిపారు. ఇప్పటికే అధికంగా పన్నుల భారం మోస్తున్న చట్టబద్దమైన పొగాకు పరిశ్రమ.. జిఎస్‌టి వల్ల మరింత సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం ఉందని వెల్లడించారు.