బిజినెస్

వచ్చే మూడేళ్లలో 5,880 మెగావాట్ల విద్యుత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 21: వచ్చే మూడేళ్లలో 5,880 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టులను 37,938 కోట్ల రూపాయలతో పూర్తి చేస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కొత్తగూడెం టిపిఎస్ 7వ దశ 800 మెగావాట్ల పాజెక్టును 5,548 కోట్ల రూపాయలతో, భద్రాద్రి థర్మల్ విద్యుత్ 1,080 మెగావాట్ల ప్రాజెక్టును 7,291 కోట్ల రూపాయలతో, యాదాద్రి థర్మల్ విద్యుత్ 4,000 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టును 25,099 కోట్ల రూపాయలతో పూర్తి చేస్తామని ఇంధన శాఖ మంత్రి జగదీష్ రెడ్డి మంగళవారం పద్దుల్లో పేర్కొన్నారు. మొత్తం వ్యయంలో 30 శాతం రాష్ట్ర ప్రభుత్వం, 70 శాతం రుణాలు ఇచ్చే సంస్థలు భరిస్తాయన్నారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఉచిత విద్యుత్, ఇతర సబ్సిడీలకు 4,584 కోట్ల రూపాయల నిధులను కేటాయించిందన్నారు. వ్యవసాయానికి 9 గంటల విద్యుత్ సరఫరా కోసం రూపొందిం చిన ట్రాన్స్‌మిషన్, పంపిణీ నెట్‌వర్క్స్ ప్రణాళికకు 2,394 కోట్ల రూపాయ లను ఖర్చు చేస్తున్నామన్నారు. కేంద్ర విద్యుత్ సంస్థల నుంచి 22.66 కోట్ల రూపాయలతో 58.59 ఎంయును కోనుగోలు చేశామన్నారు. నిరుడు ఏప్రిల్ 1వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు ఝజ్జర్ విద్యుత్ ప్రాజెక్టు నుండి 40.587 కోట్ల రూపాయల వ్యయంతో 74.303 ఎంయు విద్యుత్‌ను కొనుగోలు చేశామన్నారు. రాష్ట్రంలో సదరన్ డిస్కాం విద్యుత్ పంపిణీ నష్టాలను వచ్చే ఏడాది 14.4 శాతానికి, 2018-19 నాటికి 13.9 శాతానికి తగ్గిస్తామన్నారు. ఉత్తర డిస్కాంలో వచ్చే ఏడాది 12.28 శాతానికి, 2018-19లో 12 శాతానికి తగ్గిస్తామన్నారు. 1,408.39 కోట్ల రూపాయలతో 4,33,114 వ్యవసాయ సర్వీసులకు హెచ్‌విడిఎస్ అమలు చేసినట్లు చెప్పారు. ఈ ఏడాది విద్యుత్ సబ్సిడీకి 4,203 కోట్ల రూపాయలను కేటాయించినట్లు చెప్పారు.