బిజినెస్

చౌక నివాసయోగ్య ప్రాంతాల్లో నాలుగు భారతీయ నగరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 21: ప్రపంచవ్యాప్తంగా నివాసయోగ్యమైన చౌక నగరాల్లో నాలుగు భారతీయ నగరాలున్నాయి. తక్కువ ఖర్చుతో నివాసానికి అనువైన ఈ నగరాల జాబితాలో బెంగళూరు, చెన్నై, ముంబయి, న్యూఢిల్లీలకు స్థానం లభించింది. ఎకనామిస్ట్ ఇంటిలిజెన్స్ యూనిట్ (ఇఐయు) నివేదిక ప్రకారం టాప్-10లో బెంగళూరుకు మూడో స్థానం దక్కగా, చెన్నై ఆరు, ముంబయి ఏడు, ఢిల్లీ 10 స్థానాల్లో నిలిచాయి. ఇక ఈ జాబితాలో మొదట ఉన్నది కజకిస్తాన్‌లోని అతిపెద్ద నగరమైన అల్మటి. రెండో స్థానంలో నైజీరియాలోని అతిపెద్ద నగరమైన లాగోస్ ఉండగా, పాకిస్తాన్‌లోని కరాచీ (4), అల్జీరియా రాజధాని అల్జీర్స్ (5), ఉక్రెయిన్ రాజధాని కీవ్ (8), రొమేనియా రాజధాని బుఖారెస్ట్ (9) టాప్-10 జాబితాలో చోటు దక్కించుకున్నాయి. ఇందులో ఐదు నగరాలు భారత్, పాకిస్తాన్‌లకు చెందినవే కావడం విశేషం. డబ్బును పొదుపుగా ఖర్చుచేసే సంప్రదాయం ఈ నగరాల్లో ఎక్కువగా కనిపిస్తోందని నివేదికల నిర్వహణ సంస్థ అయిన ఇఐయు ఈ సందర్భంగా అభిప్రాయపడింది. ఇదిలావుంటే ఇఐయు అత్యంత ఖరీదైన నగరాల జాబితాలో సింగపూర్ ప్రథమ స్థానంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా చూసినట్లైతే ఇక్కడ నివాసం.. చాలా ఖర్చుతో కూడుకున్నదని ఈ ఏడాదికిగాను విడుదలైన తాజా జాబితా పేర్కొంది. సింగపూర్ ఇలా మొదట నిలవడం ఇది వరుసగా నాలుగోసారి కావడం గమనార్హం. కాగా, టాప్-10లో ఆసియాకు చెందిన నగరాలే అధికంగా ఉన్నాయి. హాంకాంగ్ రెండో స్థానంలో, జ్యూరిచ్ మూడో స్థానంలో ఉండగా, ఆ తర్వాతి స్థానాల్లో టోక్యో (4), ఒసాకా (5), సియోల్ (6), జెనీవా (7), పారిస్ (8), న్యూయార్క్ (9), కోపెన్‌హెగెన్ (10) ఉన్నాయి. లాస్ ఏంజెల్స్ 11వ స్థానంలో ఉన్నట్లు ఇఐయు తెలిపింది. ఏడాదికి రెండుసార్లు ఈ జాబితాలు తయారవుతాయి. 400 మంది అభిప్రాయాల ఆధారంగా ఇవి రూపొందుతాయి. ఆహారం, పానియాలు, దుస్తులు, గృహోపకరణాలు, వ్యక్తిగత, చర్మ సౌందర్య సాధనాలు, ఇంటి అద్దెలు, రవాణా, యుటిలిటి బిల్స్, ప్రైవేట్‌రంగ పాఠశాల విద్య తదితర అవసరాల ఖర్చుల ఆధారంగా ఈ జాబితాలు రూపొందుతున్నాయి.