బిజినెస్

తెలంగాణలో పరిశ్రమల వికేంద్రీకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 21: తెలంగాణలో పారిశ్రామిక రంగం అభివృద్ధికి, వికేంద్రీకరణకు చర్యలు తీసుకోవాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాణిజ్య పరిశ్రమల మండళ్ల సమాఖ్య (ఎఫ్‌టాప్సీ) డిమాండ్ చేసింది. మంగళవారం ఇక్కడ ఎఫ్‌టాప్సీ అధ్యక్షుడు రవీంద్ర మోదీ, ఉపాధ్యక్షుడు గౌర శ్రీనివాస్ టిఎస్ ఐపాస్ విధానంపై అధ్యయనం చేసి 12 సిఫార్సులను చేశారు.
ఈ మేరకు ఒక నివేదికను విడుదల చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన టిఎస్ ఐపాస్ విధానం దేశానికే ఆదర్శంగా ఉందన్నారు. రాష్ట్రంలో గత రెండున్నర సంవత్సరాల్లో టిఎస్ ఐపాస్ విధానం కింద 58,341.15 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని, 3,451 పరిశ్రమలు నెలకొల్పారని, 2,20,758 మందికి ఉద్యోగాలు వచ్చాయని పేర్కొన్నారు. కాగా, మరో 1,449 పరిశ్రమలు నిర్మాణంలో ఉన్నాయని చెప్పారు.
రంగారెడ్డి జిల్లాలో 1,230 పరిశ్రమలు, మెదక్‌లో 498, కరీంనగర్‌లో 425, వరంగల్‌లో 297, నిజామాబాద్‌లో 168, ఖమ్మంలో 179, నల్లగొండలో 294, మహబూబ్‌నగర్‌లో 144, ఆదిలాబాద్‌లో 206, హైదరాబాద్‌లో 10 పరిశ్రమలు ఏర్పాటు చేశారన్నారు. కాగా, పెట్టుబడులను విశే్లషిస్తే రంగారెడ్డికి 14,377.1 కోట్ల రూపాయలు, కరీంనగర్‌కు 11,434.87 కోట్ల రూపాయలు, ఆదిలాబాద్‌కు 6,761.67 కోట్ల రూపాయలు, ఖమ్మంకు 7,483.11 కోట్ల రూపాయలు వచ్చాయన్నారు. జనరల్ కేటగిరీలోని పరిశ్రమలకు టి-ప్రైడ్ ప్రోత్సాహకాలు ఇవ్వాలని, వెనకబడిన ప్రాంతాల అభివృద్ధిని ప్రత్యేకంగా పరిగణనలోకి తీసుకోవాలని, ఆదిలాబాద్‌ను కాటన్ జోన్‌గా ప్రకటించాలని, స్పిన్నింగ్ మిల్స్ ఏర్పాటుకు వౌలిక సదుపాయాలు, ఆర్థిక సహాయం చేయాలని కోరారు. మహారాష్ట్ర తరహాలో ప్రతి తాలూకాను ఏడు వర్గాలుగా విభజించాలని, విద్యుత్ సుంకంపై సబ్సిడీ ఇవ్వాలని, కొత్త యూనిట్లకు విద్యుత్ సుంకం నుంచి మినహాయింపు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.
ప్రైవేట్, లేదా పిపిపి పద్ధతిన ప్రతి పారిశ్రామిక ఉత్పత్తులకు పార్కులను ఏర్పాటు చేయాలన్నారు. పర్యాటక రంగంకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని, మదర్ ఇండస్ట్రీస్‌ను నెలకొల్పాలని సూచించారు. పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా పాలిటెక్నిక్, ఐటిఐల్లో కోర్సులను ప్రవేశపెట్టాలన్నారు. జిల్లా స్థాయి పరిశ్రమల కేంద్రాలను బలోపేతం చేయాలని, రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో రవాణా సదుపాయాలను మెరుగుపరచాలని డిమాండ్ చేశారు.

చిత్రం..టిఎస్ ఐపాస్ విధానంపై అధ్యయనం చేసి సిఫార్సులను ప్రకటిస్తున్న ఎఫ్‌టాప్సీ ప్రతినిధుల బృందం