బిజినెస్

దుమ్మురేపిన డీ-మార్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 21: రిటైల్ వ్యాపార విభాగం డీ-మార్ట్ నిర్వహణదారైన అవెన్యూ సూపర్‌మార్ట్స్ షేర్లు.. మదుపరులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్లలో మంగళవారం అవెన్యూ సూపర్‌మార్ట్స్ షేర్ల లిస్టింగ్ జరగగా, తొలిరోజే షేర్ విలువ ఏకంగా 114 శాతానికిపైగా లాభపడింది. 299 రూపాయల విలువతో స్టాక్ మార్కెట్లలోకి అడుగిడిన అవెన్యూ సూపర్‌మార్ట్స్ షేర్.. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ (బిఎస్‌ఇ) ట్రేడింగ్ ప్రారంభమయ్యాక 102.14 శాతం వృద్ధితో 604.40 రూపాయలను తాకింది. ముగిసే సమయానికి 114.29 శాతం లాభంతో 640.75 రూపాయల వద్ద స్థిరపడింది.
ఒక దశలోనైతే 117.39 శాతం వృద్ధిని నమోదు చేస్తూ 650 రూపాయలకు చేరింది. ఇక నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ (ఎన్‌ఎస్‌ఇ)లో 114.58 శాతం లాభంతో 641.60 రూపాయల వద్ద ముగిసింది అవెన్యూ సూపర్‌మార్ట్స్ షేర్ విలువ. కాగా, రాధాకిషన్ దమని నేతృత్వంలోని ఈ సంస్థ.. ఇటీవలే 1,870 కోట్ల రూపాయల విలువైన ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపిఒ)తో మదుపరుల ముందుకు వచ్చినది తెలిసిందే. 145.67 లక్షల షేర్లను అమ్మకానికి పెట్టింది.
‘ఈ మధ్య కాలంలో లిస్టింగ్ సందర్భంగా మదుపరులను అమితంగా ఆకర్షించి, అధిక లాభాలను అందుకున్న సంస్థ ఇదే.’ అని అవెన్యూ సూపర్‌మార్ట్స్ స్టాక్ మార్కెట్ల ప్రవేశంపై స్పందిస్తూ శామ్‌కో సెక్యూరిటీస్ సిఇఒ జిమీత్ మోదీ అన్నారు. నిరుడు అక్టోబర్‌లో నమోదైన 3,000 కోట్ల రూపాయల విలువైన పిఎన్‌బి హౌసింగ్ ఫైనాన్స్ ఐపిఒ తర్వాత వచ్చిన అతిపెద్ద ఐపిఒ అవెన్యూ సూపర్‌మార్ట్సే. ఈ నెల ఆరంభంలో ముందుకొచ్చిన అవెన్యూ సూపర్‌మార్ట్స్ ఐపిఒ.. 104 రెట్లకుపైగా సబ్‌స్క్రైబ్ అయ్యింది. మార్చి 8-10 తేదీల్లో వచ్చిన ఈ పబ్లిక్ ఇష్యూలో షేర్ ధర 295-299 రూపాయలుగా ఉంది. మదుపరుల విశేష స్పందనతో 299 రూపాయల గరిష్ఠ ధరకు స్టాక్ మార్కెట్లలోకి ప్రవేశించాయి అవెన్యూ సూపర్‌మార్ట్స్ షేర్లు. కాగా, నిరుడు వచ్చిన ఐపిఒల్లో అడ్వాన్స్‌డ్ ఎంజైమ్ ఐపిఒ 116 రెట్లు, క్వెస్ కార్ప్ 145 రెట్లు సబ్‌స్క్రైబ్ అయ్యాయి.