బిజినెస్

‘పెన్సిల్వేనియాకు భారత్ నిర్మాణాత్మక భాగస్వామి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 23: అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఒకటైన పెన్సిల్వేనియా, భారత్ మధ్య సంబంధాలు నిర్మాణాత్మకమైనవని పెన్సిల్వేనియా అంతర్జాతీయ వాణిజ్యాభివృద్ధి శాఖ డిప్యూటీ సెక్రటరీ జోసెఫ్ బర్కే పేర్కొన్నారు. భారత్‌కు చెందిన 68 తయారీరంగ సంస్థలు పెన్సిల్వేనియాలో తమ వాణిజ్య కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయని, వీటి ద్వారా స్థానికంగా 2,247 మందికి ఉద్యోగాలు లభించాయని తెలిపారు. గురువారం ఇక్కడ తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక, ఆర్థిక, వాణిజ్య మండళ్ల సమాఖ్య, పెన్సిల్వేనియా అంతర్జాతీయ వాణిజ్య సమాఖ్య సంయుక్త ఆధ్వర్వంలో ఏర్పాటు చేసిన ‘పెన్సిల్వేనియాలో వాణిజ్య అవకాశాలు’ సదస్సుకు జోసెఫ్ బర్గ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 85 బిలియన్ డాలర్ల వాణిజ్యంతో అమెరికా స్థూల ఆర్థికాభివృద్ధిలో 8వ స్థానంలో కొనసాగుతున్న పెన్సిల్వేనియాలో ఉత్పా దక, వ్యవసాయ, ఐటి, ఫైనాన్సింగ్‌లో వాణిజ్య అవకాశాలు విస్తృతంగా ఉన్నాయని ఆయన తెలిపారు.