బిజినెస్

ప్యాకేజింగ్ పరిశ్రమకు సంపూర్ణ సహకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 23: తెలంగాణ రాష్ట్రంలో ప్యాకేజింగ్ పరిశ్రమకు సంపూర్ణ సహకారం అందిస్తామని ఐటి, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ తెలిపారు. గురువారం ఇక్కడ ‘ఇన్నోవిజన్ ఇన్ ప్యాకేజింగ్’ అనే అంశంపై రెండు రోజుల జాతీయ సమావేశాన్ని ఆయన ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం పరిశోధనలకు ప్రోత్సాహాన్ని అందిస్తోందని, సిసిఎంబి, ఐఐసిటి, ఇక్రిసాట్ వంటి పరిశోధన సంస్థలు హైదరాబాద్‌లో పనిచేస్తున్నాయని తెలిపారు. హార్డ్‌వేర్ పరిశ్రమకూ ప్రోత్సాహాన్ని అందిస్తూ టి హబ్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. ఎలక్ట్రానిక్స్, సెమికండక్టర్, హార్డ్‌వేర్ స్టార్టప్స్ కోసం ప్రోటోటైపింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు టి-హబ్ ప్రణాళిక సిద్ధం చేసిందని తెలిపారు. రాష్టప్రతి చేతుల మీదుగా ఈ సెంటర్ ప్రారంభం కావచ్చన్నారు. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సాహు మాట్లాడుతూ ప్యాకేజింగ్‌పై ఇంజినీరింగ్ గ్రాడ్యుయేషన్ ప్రారంభిస్తామని, యుజిసి గుర్తింపు రాగానే 2018 నుంచి కోర్సు ప్రారంభమవుతుందని తెలిపారు. 2020 నాటికి భారత ప్యాకేజి మార్కెట్ 32 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా ఉందన్నారు. జర్మనీ, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా తదితర దేశాల నుంచి ఈ రెండు రోజుల సమావేశంలో పాల్గొనేందుకు ప్రతినిధులు హాజరయ్యారు.