బిజినెస్

ఎయిర్‌టెల్ చేతికి టికోనా 4జి వ్యాపారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 23: దేశీయ ప్రైవేట్‌రంగ టెలికామ్ దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్.. టికోనా నెట్‌వర్క్స్ 4జి వ్యాపారాన్ని చేజిక్కించుకుంది. దాదాపు 1,600 కోట్ల రూపాయలకు సొంతం చేసుకోగా, దేశవ్యాప్తంగా 5 సర్కిళ్లలోగల 350 సైట్లు, బ్రాడ్‌బాండ్ స్పెక్ట్రమ్‌ను కూడా దక్కించుకుంది. ఈ మేరకు గురువారం ఎయిర్‌టెల్ ప్రకటించింది. గుజరాత్, ఉత్తరప్రదేశ్ (తూర్పు), ఉత్తరప్రదేశ్ (పశ్చిమ), రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ సర్కిళ్లలో టికోనాకు 2,300 మెగాహెట్జ్ శ్రేణిలో 20 మెగాహెట్జ్ స్పెక్ట్రమ్ ఉంది. దీంతో జియో తర్వాత 2,300 మెగాహెట్జ్ శ్రేణిలో దేశవ్యాప్తంగా స్పెక్ట్రమ్ కలిగిన రెండో సంస్థగా ఎయిర్‌టెల్ నిలిచింది.