బిజినెస్

లాభాల్లో స్టాక్ మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మార్చి 23: దేశీయ స్టాక్ మార్కెట్లు ఎట్టకేలకు గురువారం లాభాలను అందుకున్నాయి. వరుసగా గత మూడు రోజులు నష్టాలపాలైన నేపథ్యంలో చమురు, గ్యాస్, ఆటో, మెటల్, క్యాపిటల్ గూడ్స్ రంగాల షేర్లు మదుపరులను ఆకట్టుకోవడంతో సూచీలు కోలుకున్నాయి. ఈ క్రమంలోనే బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 164.48 పాయింట్లు పుంజుకుని 29,332.16 వద్ద స్థిరపడగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 55.85 పాయింట్లు పెరిగి 9,086.30 వద్ద నిలిచింది. అటు అంతర్జాతీయంగా ఆసియా, ఐరోపా మార్కెట్లు కూడా లాభాలను అందుకోవడం దేశీయ మార్కెట్లకు కలిసొచ్చింది.