బిజినెస్

చోదక రహిత కార్లదే హవా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 24: డ్రైవర్లు లేకుండా నడిచే వాహనాలు భవిష్యత్‌లో పెద్ద ఎత్తున రాబోతున్నాయని, డ్రైవింగ్ సీట్లో మనిషి లేకుండానే నడిచే కార్లు ఇప్పటికే అభివృద్ధి చెందిన దేశాల్లో ఉన్నాయని ఐఐటి మద్రాస్ మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ పి వి మణివన్నన్ అన్నారు. గీతం విశ్వవిద్యాలయం ‘ఆటోమెటెడ్ హైవే సిస్టమ్స్-ఇంటిలిజెంట్ వెహికల్స్’ అనే అంశంపై నిర్వహించిన సెమినార్‌లో ఆయన మాట్లాడుతూ 95 శాతం ప్రమాదాలు మానవ తప్పిదాల వల్లే జరుగుతున్నాయని, వాటిని అరికట్టాలనే దిశలో ప్రయోగాలు చేపట్టారని, గూగుల్ ఇప్పటికే డ్రైవర్ లేకుండా వాహనాలు నడిపే సాంకేతికతను సమకూర్చుకుందని తెలిపారు. కంప్యూటర్ ప్రోగ్రామింగ్ ద్వారా నడిచే కార్లలో పలు విభాగాలను సెన్సార్లు అదుపుచేస్తాయని, భావోద్రేకాలకు అతీతంగా, నిర్ధారిత సూచనల మేరకు నడపడం వల్ల ప్రమాదాలు అరికట్టవచ్చని చెప్పారు. నిర్దేశించిన వేగంలో కారు నడపడం వల్ల ఇంధనం కూడా ఆదా అవుతుందని, ఉద్ఘారాలను కూడా తగ్గించి వాతావరణాన్నీ కాపాడవచ్చని పేర్కొన్నారు. చోదక రహిత కారు ఏదైనా ప్రమాదానికి గురైనపుడు జీపీఆర్‌ఎస్ సిస్టం ద్వారా సమీపంలోని పోలీసు స్టేషన్, ఆస్పత్రితో పాటు తనను అదుపు చేసే సెంట్రల్ కంప్యూటర్‌కు కూడా సంక్షిప్త సందేశాలను పంపించి తక్షణ సాయం అందేలా తోడ్పడుతుందని పేర్కొన్నారు. చౌపర్ ప్రోగ్రాం సాయంతో ఒక గమ్యం వైపు వెళ్లే రవాణా వాహనాలన్నీ కాన్వాయ్‌లో ఒకదాని తర్వాత మరొకటి వెళ్లే విధానాన్ని విదేశాల్లో అనుసరిస్తున్నారని, దీనివల్ల ముందున్న వాహన డ్రైవర్ అప్రమత్తంగా ఉంటే చాలని, మిగిలిన వాహనాలు అన్నీ ఆటోమెటిక్‌గా దానిని అనుసరిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రొ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎన్ శివప్రసాద్, ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సిహెచ్ సంజయ్, రెసిడెంట్ డైరెక్టర్ డివివిఎస్‌ఆర్ వర్మ తదితరులు పాల్గొన్నారు.