బిజినెస్

కౌంట్‌డౌన్ మొదలైంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 24: నల్లధన కుబేరులను ఆదాయ పన్ను (ఐటి)శాఖ శుక్రవారం హెచ్చరించింది. ఈ నెల 31తో ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన (పిఎమ్‌జికెవై) పథకం ముగుస్తున్న క్రమంలో నల్లధనం కలిగి ఉన్నవారు తమ అక్రమ సంపద వివరాలను బయట పెట్టాలని, లేనిపక్షంలో కఠిన చర్యలు తప్పవని ప్రకటించింది. తమ వద్ద నల్లధన అక్రమార్కుల ఆర్థిక వివరాలన్నీ ఉన్నాయని చెప్పింది. ఈ మేరకు ప్రధాన జాతీయ దినపత్రికల్లో ప్రకటనలు కూడా ఇచ్చారు. ‘మీ డిపాజిట్లకు సంబంధించి మా వద్ద పూర్తి వివరాలున్నాయి. పిఎమ్‌జికెవై పథకం క్రింద మీరు వెల్లడించే వివరాలను రహస్యంగా ఉంచుతాం.’ అని ఆదాయ పన్ను శాఖ ప్రకటన జారీ చేసింది. కాగా, ఈ నెల 31 తర్వాత తమ వద్దనున్న నల్లధన సంపన్నుల వివరాలను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి)తోపాటు కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ)కు ఆదాయ పన్ను శాఖ అందించనుంది. ఇక పిఎమ్‌జికెవై పథకం క్రింద అక్రమ ఆదాయాన్ని ప్రకటిస్తే ఆ వ్యక్తులు లేదా సంస్థలు సదరు ఆదాయం విలువలో 49.9 శాతం పన్నును చెల్లించాలని ఐటి శాఖ తెలిపింది. ఈ పథకంలో కాకుండా తమ ఐటి రిటర్న్స్‌లో స్వచ్చంధంగా వెల్లడిస్తే 77.25 శాతం మేర జరిమానా, పన్నుగా చెల్లించాలని వివరించింది. తమ లెక్కల పరిశీలనలో దొరికితే మాత్రం 83.25 శాతం ఇవ్వాల్సి ఉంటుందని చెప్పింది. ఇక అధికారుల సోదాల్లో పట్టుబడినప్పుడు 107.25 శాతం, అప్పుడు కూడా తమ అక్రమ సొమ్మును అప్పగించకపోతే దొరికిన ఆ సొమ్ము విలువ ఆధారంగా అత్యధికంగా 137.25 శాతం మేర జరిమానా, పన్ను రూపంలో చెల్లించాల్సి ఉంటుందని ఐటి శాఖ స్పష్టం చేసింది. బినామీ చట్టం క్రింద కేసులు కూడా పెడతామని, గరిష్ఠంగా ఏడేళ్ల వరకు జైలుశిక్ష పడుతుందని, అక్రమాస్తులను జప్తు కూడా చేస్తామని పేర్కొంది. నల్లధనం, నకిలీ కరెన్సీల నిర్మూలన కోసం కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం విస్తృతంగా చర్యలు తీసుకుంటున్నది తెలిసిందే. ఈ క్రమంలోనే నిరుడు నవంబర్ 8వ తేదీ రాత్రి పాత పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు కూడా మోదీ ప్రకటించారు. రద్దయిన 500, 1,000 రూపాయల నోట్లను బ్యాంకులు, పోస్ట్ఫాసుల్లో డిపాజిట్ చేసుకుని, కొత్తగా తెచ్చిన 500, 2,000 రూపాయల నోట్లను పొందవచ్చని కూడా తెలిపారు. దీంతో రద్దయిన నోట్ల డిపాజిట్లపై ఐటి శాఖ కనే్నయగా, లెక్కల్లో చూపని నగదు మొత్తాలను, ఖాతాల్లో పెద్ద ఎత్తున జమవుతున్న అక్రమ సంపదను ఒడిసిపట్టింది. ఈ వివరాలను చేజిక్కించుకుంది. వీటికి సంబంధించిన వివరాలను ఖాతాదారులను అడుగుతున్న ఐటి శాఖ.. అందుకు గడువును కూడా విధించింది. అయినప్పటికీ సహకరించనివారిపై ఇప్పుడిక చర్యలకు ఉపక్రమిస్తోంది.
మరోవైపు 2013 ఏప్రిల్ నుంచి ఈ ఏడాది జనవరి వరకు జరిపిన సోదాల్లో 45,622 కోట్ల రూపాయల అప్రకటిత ఆదాయం బయటపడిందని శుక్రవారం లోక్‌సభకు లిఖితపూర్వక సమాధానంగా కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ తెలిపారు. దాదాపు 2,534 సోదాలు జరిగాయని, ఇందులో సుమారు 3,625 కోట్ల రూపాయల విలువైన నగదు, ఆభరణాలు తదితర విలువైన వస్తువులనూ స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.