బిజినెస్

కోల్ ఇండియాపై సిసిఐ జరిమానా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 24: ప్రభుత్వరంగ బొగ్గు ఉత్పాదక దిగ్గజం కోల్ ఇండియా లిమిటెడ్ (సిఐఎల్)పై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) శుక్రవారం 591 కోట్ల రూపాయల జరిమానా విధించింది. బొగ్గు సరఫరా ఒప్పందాల్లో కాంపిటీషన్ నిబంధనల ఉల్లంఘనే ఇందుకు కారణం. ఇంధన సరఫరా ఒప్పందాలు పారదర్శకంగా లేవని, మార్కెట్‌లో ఆరోగ్యకర పోటీతత్వాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని తాము గుర్తించామన్న సిసిఐ.. 2009-10 నుంచి 2011-12 ఆర్థిక సంవత్సరాల మధ్య మూడేళ్లపాటు కోల్ ఇండియా సాధించిన సగటు టర్నోవర్‌లో ఒక శాతాన్ని పన్నుగా విధిస్తున్నట్లు 56 పేజీల ఆదేశంలో తెలిపింది.