బిజినెస్

డిసెంబర్ ఉత్పత్తి లక్ష్యాన్ని అధిగమించిన కోల్ ఇండియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 1: ప్రభుత్వరంగ బొగ్గు ఉత్పాదక దిగ్గజం కోల్ ఇండియా.. గత నెల డిసెంబర్‌లో నిర్దేశిత ఉత్పత్తి లక్ష్యాన్ని చేధించింది. 51.08 మిలియన్ టన్నుల బొగ్గు ను ఉత్పత్తి చేయాలని నిర్దేశించుకోగా, 52.07 మిలియన్ టన్నులను ఉత్పత్తి చేసింది. అయినప్పటికీ గత ఏడాది ఏప్రిల్-డిసెంబర్ వ్యవధిలో నిర్ణయించుకున్న లక్ష్యాన్ని మాత్రం చేరలేకపోయింది. 383.08 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయాలని ముందుగా నిర్ణయించుకున్నప్పటికీ 373.45 మిలియన్ టన్నుల బొగ్గుకే పరిమితమైంది. ఈ మేరకు శుక్రవారం బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు కోల్ ఇండియా తెలియజేసింది. కాగా, మొత్తం గత ఆర్థిక సంవత్సరం (2014-15)లో నిర్దేశిత ఉత్పాదక లక్ష్యానికి 3 శాతం దూరంగా 494.23 మిలియన్ టన్నుల బొగ్గును కోల్ ఇండియా సాధించింది. ఈ ఆర్థిక సంవత్సరం (2015-16)లో 550 మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్యాన్ని నిర్ణయించారు. దేశంలో ఉత్పత్తి అవుతున్న బొగ్గులో 80 శాతానికిపైగా వాటా కోల్ ఇండియాదే. లక్ష్యాలను అధిగమిస్తూ విజయపథంలో కోల్ ఇండియా లిమిటెడ్ దూసుకెళ్ళాలన్న ఆశాభావాన్ని నూతన సంవత్సరం సందర్భంగా బొగ్గు శాఖ కార్యదర్శి అనిల్ స్వరూప్ వ్యక్తం చేశారు.
వృద్ధిపథంలో దేశ ఆర్థిక వ్యవస్థ
సిఇఎ అరవింద్ సుబ్రమణ్యన్
న్యూఢిల్లీ, జనవరి 1: ప్రపంచ ఆర్థిక మందగమనం, నాలుగు కరవు పరిస్థితులతో సంబంధం లేకుండా భారత ఆర్థిక వ్యవస్థ పరుగులు పెడుతుందని ముఖ్య ఆర్థిక సలహాదారు (సిఇఎ) అరవింద్ సుబ్రమణ్యన్ శుక్రవారం ట్విట్టర్‌లో పేర్కొన్నారు. అంతకుముందు కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ ఆర్థిక సంవత్సరం (2015-16) దేశ జిడిపి వృద్ధిరేటు 7 నుంచి 7.3 శాతం మించబోదని చెప్పిన నేపథ్యంలో అరవింద్ సుబ్రమణ్యన్ పైవిధంగా స్పందించారు. దేశ ఆర్థిక వ్యవస్థ.. ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థని వరుస ట్విట్‌లలో అభివర్ణించారు.
‘8 బిలియన్ డాలర్లు తగ్గనున్న
ఇంజినీరింగ్ ఎగుమతులు’
ముంబయి, జనవరి 1: భారతీయ ఇంజినీరింగ్ ఎగుమతులు ఈ ఆర్థిక సంవత్సరం (2015-16)లో గత ఆర్థిక సంవత్సరం (2014-15)తో పోల్చితే 8 బిలియన్ డాలర్లు తగ్గే వీలుందని ఇంజినీరింగ్ ఎగుమతుల ప్రోత్సాహక మండలి (ఇఇపిసి) పేర్కొంది. 2014-15లో 70 బిలియన్ డాలర్లుగా ఉన్న ఇంజినీరింగ్ ఎగుమతులు.. 2015-16లో 60-62 బిలియన్ డాలర్లకు పరిమితం కావచ్చని ఇఇపిసి అంచనా వేసింది. కమాడిటీ ధరల్లో చోటుచేసుకున్న ఆకస్మిక పతనమే దీనికి కారణమని ఇఇపిసి ఇండియా చైర్మన్ టిఎస్ భాసిన్ అన్నారు. దేశ వాణిజ్య ఎగుమతుల్లో ఇంజినీరింగ్ ఎగుమతుల వాటా 23 శాతంగా ఉంది.