బిజినెస్

ఆర్థిక సంస్కరణలపై ఆశతో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 26: భారతీయ క్యాపిటల్ మార్కెట్లకు విదేశీ పోర్ట్ఫోలియో లేదా సంస్థాగత మదుపరుల (ఎఫ్‌పిఐ) నుంచి పెట్టుబడులు పోటెత్తుతున్నాయ. నిరుడు దేశీయ మార్కెట్ల నుంచి విదేశీ మదుపరులు లాగేసుకున్న పెట్టుబడుల విలువ గడచిన ఎనిమిదేళ్లలోనే గరిష్ఠంగా నమోదైనది తెలిసిందే. ఈ ఏడాది ప్రారంభ నెలైన జనవరిలోనూ భారత మార్కెట్ల నుంచి పెట్టుబడులను వెనక్కి తీసుకున్న ఎఫ్‌పిఐలు.. ఫిబ్రవరిలో మాత్రం తీరు మార్చుకున్నారు. మార్చిలోనూ అదే తీరును కనబరుస్తుండగా, ఇప్పటిదాకా ఈ నెలలో దాదాపు 40 వేల కోట్ల రూపాయల పెట్టుబడులను విదేశీ మదుపరులు పట్టుకొచ్చారు. వరుసగా నాలుగు నెలలు పెట్టుబడులను లాగేసుకున్న విదేశీ మదుపరులు.. ఫిబ్రవరిలో స్టాక్ మార్కెట్లలోకి 9,902 కోట్ల రూపాయల పెట్టుబడులను, రుణ మార్కెట్లలోకి మరో 5,960 కోట్ల రూపాయల పెట్టుబడులను తెచ్చారు. దీంతో అటు స్టాక్, ఇటు రుణ మార్కెట్లలోకి ఫిబ్రవరిలో వచ్చిన విదేశీ పెట్టుబడుల విలువ 15,862 కోట్ల రూపాయలకు చేరింది. అయతే మార్చిలో ఈ విలువ రెట్టింపయ్యంది.
1-24 తేదీల మధ్య స్టాక్ మార్కెట్లలోకి 22,268 కోట్ల రూపాయల పెట్టుబడులను తీసుకొచ్చిన ఎఫ్‌పిఐలు.. రుణ మార్కెట్లలోకి మరో 16,177 కోట్ల రూపాయల పెట్టుబడులను తెచ్చారు. దీంతో మొత్తం మార్చి నెలలో దేశీయ మార్కెట్లలోకి వచ్చిన విదేశీ పెట్టుబడుల విలువ 38,445 కోట్ల రూపాయలకు చేరింది. నిజానికి నిరుడు స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి కనబరిచిన ఎఫ్‌పిఐలు.. రుణ మార్కెట్లకు మాత్రం దూరంగా ఉండిపోయారు. అయతే జనవరిలో రుణ మార్కెట్లతోపాటు స్టాక్ మార్కెట్లలోనూ పెట్టుబడులకు నిరాసక్తిని ప్రదర్శించారు. దీంతో మార్కెట్ వర్గాలు ఉలిక్కిపడగా, ఫిబ్రవరిలో తిరిగి పెట్టుబడులపట్ల ఎఫ్‌పిఐలు మొగ్గుచూపడం.. మార్కెట్లలో కొత్త ఆశలను చిగురింపజేశాయ. 2016లో భారతీయ మార్కెట్ల నుంచి 3.2 బిలియన్ డాలర్ల (23,079 కోట్ల రూపాయలు) విదేశీ పెట్టుబడులు తరలిపోయాయ. పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో కేవలం నవంబర్‌లోనే సుమారు 6 బిలియన్ డాలర్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న మదుపరులు.. అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీరేట్ల పెంపు మధ్య డిసెంబర్‌లో దాదాపు 4 బిలియన్ డాలర్ల పెట్టుబడులను లాగేసుకున్నారు. అక్టోబర్‌లోనూ 2 బిలియన్ డాలర్ల వరకు పెట్టుబడులను గుంజేశారు. దీంతో నిరుడు చివరి మూడు నెలల్లో భారతీయ మార్కెట్ల నుంచి తరలిపోయన ఎఫ్‌పిఐ పెట్టుబడుల విలువ 12 బిలియన్ డాలర్లుగా నమోదైంది. గత నెల జనవరితో కలుపుకుని మొత్తం అటు స్టాక్, ఇటు రుణ మార్కెట్ల నుంచి ఉపసంహరించుకున్న పెట్టుబడుల విలువ 80,310 కోట్ల రూపాయలకు చేరింది. నిరుడు సెప్టెంబర్‌లో 20,000 కోట్ల రూపాయలకుపైగా విదేశీ పెట్టుబడులు దేశీయ మార్కెట్లలోకి రాగా, మళ్లీ ఫిబ్రవరిలోనే సుమారు 16,000 కోట్ల రూపాయల విదేశీ పెట్టుబడులొచ్చాయ. కాగా, నిరుడు జూలై-సెప్టెంబర్‌లో విదేశీ మదుపరులు భారతీయ మార్కెట్లలోకి 46,000 కోట్ల రూపాయల పెట్టుబడులను తెచ్చారు. పార్లమెంట్‌లో కీలకమైన వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) ఏకగ్రీవంగా ఆమోదం పొందడం, ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) తొలి త్రైమాసికానికి (ఏప్రిల్-జూన్)గాను వివిధ సంస్థలు ప్రకటించిన త్రైమాసిక ఆర్థిక ఫలితాలు బాగుండటం వంటివి దేశీయ స్టాక్, రుణ మార్కెట్లలోకి విదేశీ పెట్టుబడులను అమితంగా రప్పించాయ.
ఇక జనవరి-జూన్‌లో స్టాక్ మార్కెట్లలోకి 20,000 కోట్ల రూపాయలకుపైగా పెట్టుబడులను తెచ్చిన ఎఫ్‌పిఐలు.. రుణ మార్కెట్ల నుంచి 12,000 కోట్ల రూపాయలకుపైగా పెట్టుబడులను లాగేసుకున్నారు. 2016 సంవత్సరం మొత్తంగా స్టాక్ మార్కెట్లలోకి 20,566 కోట్ల రూపాయల పెట్టుబడులను పట్టుకొచ్చిన విదేశీ మదుపరులు.. రుణ మార్కెట్ల నుంచి 43,645 కోట్ల రూపాయల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. దీంతో భారతీయ మార్కెట్ల నుంచి 2016లో 23,079 కోట్ల రూపాయల విదేశీ పెట్టుబడులు వెళ్లిపోయనట్లైంది. అయతే ఇటీవలి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కీలకమైన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ స్థానాన్ని బిజెపి ఒంటరిగా గెలుచుకోవడం మదుపరుల విశ్వాసాన్ని చూరగొంది. లోక్‌సభలో మెజారిటీ ఉన్నప్పటికీ, రాజ్యసభలో లేకపోవడంతో సంస్కరణల అమలు ఆలస్యమవుతుండగా, యుపి గెలుపు కేంద్రంలోని మోదీ సర్కారుకు రాజ్యసభలోనూ మెజారిటీని తెచ్చిపెట్టింది. దీంతో ఇక సంస్కరణలు పరుగులు పెడతాయన్న భావన మదుపరుల్లో సర్వత్రా వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే అటు స్టాక్, ఇటు రుణ మార్కెట్లలోకి విదేశీ పెట్టుబడులు పోటెత్తుతున్నాయ.