బిజినెస్

జిఎస్‌టితో లాభమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మార్చి 26: వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి)తో వ్యాపారులకు, వినియోగదారులకు లాభం చేకూరుతుందని ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ ఆఫ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎపిఎఫ్‌సిసిఐ) అధ్యక్షుడు వి భాస్కరరావు చెప్పారు. జిఎస్‌టి ప్రయోజనాల గురించి ఆదివారం ఇక్కడ జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. వ్యాపారులు జిఎస్‌టిపై పూర్తి అవగాహన తెచ్చుకోవాలని సూచించారు. జిఎస్‌టి పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తేగాని, దాని ప్రయోజనాలను గుర్తించలేమన్నారు. కాగా, విశాఖలో కొత్త పరిశ్రమల ఏర్పాటుకు కావల్సిన వనరులు ఉన్నాయని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దీనిని గుర్తించి, ఈ ప్రాంతంలో పరిశ్రమల స్థాపనకు చర్యలు తీసుకుంటున్నాయని, సమీప భవిష్యత్‌లో విశాఖ పారిశ్రామిక రాజధానిగా రాణించబోతోందని పేర్కొన్నారు. అలాగే విశాఖలో పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారని ఆయన చెప్పారు. కమర్షియల్ టాక్స్ డిప్యూటీ కమిషనర్ డి నాగేంద్ర మాట్లాడుతూ విశాఖ పరిధిలో 19 వేల మంది ట్రేడర్స్ ఉన్నారని, వీరిలో 13 వేల మంది ఇప్పటికే జిఎస్‌టి పరిధిలోకి వచ్చారని తెలిపారు. ఏప్రిల్ ఏడో తేదీలోగా వ్యాపారులంతా జిఎస్‌టి పరిధిలోకి రావాలని ఆయన సూచించారు. ఎఫ్‌ఐఇసి కో ఆర్డినేటర్ రఘునాథ్‌బాబు మాట్లాడుతూ పారిశ్రామిక హబ్ కోసం అమరావతిలో 500 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించిందని చెప్పారు. 40 మంది సభ్యులతో కూడిన బృందం వచ్చే నెల అయిదో తేదీ నుంచి చెన్నైలో పర్యటించనుందని, అక్కడ జరుగుతున్న పారిశ్రామికాభివృద్ధిపై అధ్యయనం చేస్తుందని ఆయన వివరించారు.

చిత్రం.. మాట్లాడుతూన్న భాస్కరరావు