బిజినెస్

దేశీయ స్టాక్ మార్కెట్లకు ఆర్‌ఐఎల్ దెబ్బ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మార్చి 27: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 184.25 పాయింట్లు కోల్పోయి 29,237.15 వద్ద స్థిరపడగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 62.80 పాయింట్లు దిగజారి 9,045.20 వద్ద నిలిచింది. ఈక్విటీ డెరివేటివ్‌ల ట్రేడింగ్ నుంచి ఏడాదిపాటు ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్)ను మార్కెట్ రెగ్యులేటర్ సెబీ నిషేధించిన నేపథ్యంలో మదుపరులు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యారు. దీంతో ఆ సంస్థ షేర్ల విలువ 3 శాతం పతనమైంది. బిఎస్‌ఇలో 1,247.55 రూపాయల వద్ద, ఎన్‌ఎస్‌ఇలో 1,251.10 వద్ద నిలిచింది. ఫలితంగా ఆర్‌ఐఎల్ మార్కెట్ విలువ ఈ ఒక్కరోజే 12,488.14 కోట్ల రూపాయలు ఆవిరైపోయి 4,04,702.86 కోట్ల రూపాయలకు చేరింది. మోసపూరిత ట్రేడింగ్ ఆరోపణలపై ఆర్‌ఐఎల్‌పట్ల సెబీ కొరఢా ఝుళిపించింది. ఇకపోతే మెటల్, చమురు, గ్యాస్, హెల్త్‌కేర్, ఐటి రంగాల షేర్లు నష్టపోయాయి. అంతర్జాతీయంగా చూస్తే ఆసియా మార్కెట్లలో ప్రధాన సూచీలు నష్టపోగా, ఐరోపా మార్కెట్లలోనూ కీలక సూచీలు నష్టాల్లోనే కదలాడాయి.
17 నెలల గరిష్ఠానికి రూపాయ విలువ
డాలర్‌తో పోల్చితే రూపాయ మారకం విలువ సోమవారం 17 నెలల గరిషాఠన్ని తాకింది. ఈ ఏడాది కేవలం ఒక్కఠోజే ఈ స్థాయలో రూపాయ విలువ పెరగడం ఇది రెండోసారి. ఎగుమతిదారుల డాలర్ల అమ్మకాలతో 37 పైసలు ఎగిసి 65.04 వద్ద స్థిరపడింది.