బిజినెస్

రూ. వెయ్య కోట్లతో కందుల కొనుగోళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 27: కందుల కొనుగోలులో దేశంలోనే తెలంగాణ రెండవ స్థానంలో నిలిచింది. వెయ్యి కోట్ల రూపాయల వ్యయంతో 20 లక్షల టన్నుల కందులు కొనుగోలు చేశారు. కందుల కొనుగోలులో తెలంగాణ రికార్డు సృష్టించినట్టు మార్కెటింగ్ శాఖ మంత్రి టి హరీశ్‌రావు తెలిపారు. రైతులు పండించిన కందులలో 80 శాతం వరకు ప్రభుత్వ సంస్థలు కొనుగోలు చేశాయని చెప్పారు. సోమవారం మార్కెటింగ్ శాఖ సమావేశంలో మంత్రి ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కందులు, పొద్దు తిరుగుడు తదితర కొనుగోళ్లపై సమీక్షించారు. కంది రైతులకు ఇప్పటికే 700 కోట్ల రూపాయలు చెల్లించామన్న మంత్రి మిగతా మూడు వందల కోట్ల రూపాయలు వెంటనే చెల్లింపులు జరపాలని నాఫెడ్ ఎండి సంజీవ్ కుమార్‌ను ఆదేశించారు. దీంతో రెండు, మూడు రోజుల్లో బకాయిలు చెల్లిస్తామని నాఫెడ్ ఎండి తెలిపారు. కాగా, సన్‌ఫ్లవర్ కనీస మద్దతు ధర 3,950 రూపాయలు ఉండగా, మార్కెట్‌లో రేట్లు తగ్గడంతో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని నిర్ణయించినట్టు మంత్రి తెలిపారు. ఈ క్రమంలోనే సన్‌ఫ్లవర్ కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వ అధికారులతో సంప్రదింపులు జరపాలని మార్క్‌ఫెడ్ అధికారులను ఆదేశించారు. గోదాముల నిర్మాణంలో కేంద్రం నుంచి రావలసిన 132 కోట్ల రూపాయల సబ్సిడీ కోసం కృషి చేయాలని కూడా చెప్పారు. వేసంగిలో దాదాపు 39 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశామన్నారు. దీంతో దీనికి అవసరమైన గోదాములు సిద్ధం చేయాలని కూడా అధికారులకు సూచించారు.