బిజినెస్

పేదల ఇళ్ల నిర్మాణానికి క్రెడాయ్ చేయూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మార్చి 27: ఆర్థికంగా వెనుకబడినవారికి ప్రభుత్వాలు చేపడుతున్న గృహ నిర్మాణ ప్రాజెక్టులో భాగస్వాములమవుతామని కానె్ఫడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్) చైర్మన్ కె సుబ్బరాజు తెలియచేశారు. సోమవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా పేదల కోసం పెద్ద ఎత్తున గృహాలను నిర్మించనుందని చెప్పారు. ఏప్రిల్ 8న దేశవ్యాప్తంగా 200 గృహ నిర్మాణ ప్రాజెక్టులు ప్రారంభం కానున్నాయన్నారు. ఇందులో కొన్ని ప్రాజెక్టులు చేపట్టేందుకు క్రెడాయ్ సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు. కాగా,ప్రస్తుత ప్రభుత్వ విధానాల వలన బిల్డర్లు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సుబ్బరాజు చెప్పారు. ఉదాహరణకు వేకెంట్ ల్యాండ్ టాక్స్, ఆన్‌లైన్ దరఖాస్తు విధానం, ఇసుక విధానం బిల్డర్లలకు ఇబ్బందికరంగా మారాయన్నారు. ప్రభుత్వం అన్ని శాఖలను సమన్వయ పరిచి ఈ సమస్యలను పరిష్కరించాలని ఆయన సూచించారు. క్రెడాయ్ ఎపి చాప్టర్ ప్రెసిడెంట్ శివారెడ్డి మాట్లాడుతూ వచ్చే నెల 8న ప్రారంభం కానున్న గృహ నిర్మాణ ప్రాజెక్టుల్లో విశాఖ, విజయవాడ, తిరుపతి, కర్నూలు ప్రాజెక్టు లను క్రెడాయ్ విశాఖ చాప్టర్ చేపట్టనుందని పేర్కొన్నారు. అయితే తమకు కొన్ని రాయితీలు ఇవ్వాలని శివారెడ్డి కోరారు. ముఖ్యంగా స్టాంప్ డ్యూటీ, క్యాపిటల్ గెయిన్ టాక్స్ తదితరాల్లో రాయితీ ఇవ్వడం వలన బ్లాక్ మనీకి అవకాశం ఉండదన్నారు. పాత పెద్ద నోట్ల రద్దు తరువాత నిర్మాణ రంగం బాగా దెబ్బతిన్నదని ఆయన చెప్పారు. పేదలకు ఉచితంగా ఇసుక అందించే విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టినా.. అది పక్కదారి పడుతోందని శివారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా క్రెడాయ్ 2017-19కి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుంది. చైర్మన్‌గా కె సుబ్బరాజు, ప్రెసిడెంట్‌గా ఎ శివారెడ్డి, ప్రధాన కార్యదర్శులుగా సిహెచ్ సుధాకర్, జివిఎస్‌టి రాయు డు, డి వెంకటేష్ బాబు, కోశాధికారిగా డి వెంకటేశ్వర రెడ్డి ఎంపికయ్యారు.

చిత్రం.. విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూన్న క్రెడాయ్ చైర్మన్ సుబ్బరాజు