బిజినెస్

అనిల్ అంబానీకి అరుదైన గౌరవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 28: రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీకి అరుదైన గౌరవం దక్కింది. ‘ది అట్లాంటిక్ కౌన్సిల్’ అంతర్జాతీయ సలహాదారు బోర్డులో సభ్యత్వం లభించింది. ఈ బోర్డులో న్యూస్ కార్ప్ చైర్మన్ రూపర్ట్ మర్దోక్, స్పెయిన్ మాజీ ప్రధాన మంత్రి జోస్ మరియా అజ్నర్, ఆస్ట్రేలియా మాజీ ప్రధాన మంత్రి కెవిన్ రూధ్, ఎయిర్‌బస్ సిఇఒ థామస్ ఎండర్స్ తదితరులు సభ్యులుగా ఉన్నారు. ‘ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ కార్పొరేట్లు, రాజకీయ నాయకులు సభ్యులుగా ఉండే ది అట్లాంటిక్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ అడ్వైజరీ బోర్డులో అనిల్ అంబానీ సభ్యుడిగా ఎంపికయ్యారు.’ అని రిలయన్స్ గ్రూప్ ఓ ప్రకటనలో మంగళవారం తెలిపింది. అనిల్ అంబానీ సభ్యత్వాన్ని మేధో సంపత్తి వర్గమైన ది అట్లాంటిక్ కౌన్సిల్ మంగళవారమే ప్రకటించిందని అందులో పేర్కొంది. ఉతహ్ మాజీ గవర్నర్, అట్లాంటిక్ కౌన్సిల్ చైర్మన్ జాన్ ఎమ్ హంట్స్‌మన్.. అనిల్ అంబానీ సభ్యత్వాన్ని స్వాగతించారు. బోర్డులోకి అంబానీ రాకతో దక్షిణాసియా దేశాలకు ప్రాతినిథ్యం లభించినట్లైందని, ముఖ్యంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్‌కు చెందినవారు అనిల్ అంబానీ కావడం కలిసొస్తుందన్న ఆయన అంబానీతో కలిసి పనిచేస్తామన్నారు. మరోవైపు అనిల్ అంబానీ మాట్లాడుతూ ఈ అవకాశంపట్ల ఆనందం వ్యక్తం చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వ దృక్పథానికి, అంతర్జాతీయంగా భారత్‌కు లభించిన గుర్తింపునకు ఇది నిదర్శనమన్నారు.