బిజినెస్

కీలక రంగాల్లో మానవ వనరుల కొరత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, మార్చి 28: నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధికి మానవ వనరుల అవసరం చాలా ఉందని ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎపిఎస్‌డిసి) డైరెక్టర్ డాక్టర్ గంటా సుబ్బారావు స్పష్టం చేశారు. రాష్ట్భ్రావృద్ధిలో భాగంగా ఎక్కువగా పెట్రో కెమికల్, పెట్రో కారిడార్, షిప్ బిల్డింగ్, స్మార్ట్‌సిటీలు, ఐటి రంగం, ఆధునిక రహదారుల నిర్మాణంపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. వీటికి నిపుణులైన మానవ వనరుల అవసరం ఎంతో ఉందన్నారు. తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడ జెఎన్‌టియులో మంగళవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలతో సీమెన్స్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌తో అనుసంధానమైన మాన్యుఫాక్చరింగ్ లేబొరేటరీని సుబ్బారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశ్వవిద్యాలయాల్లో విద్యార్థుల నైపుణ్యాల పెంపుదలకు ఇన్నోవేషన్ సెంటర్లు దోహదపడతాయన్నారు. ఇన్నోవేషన్ సెంటర్ల ఏర్పాటు, అందుకు నిధుల సేకరణ, విద్యార్థులకు నూతన అనే్వషణల్లో ప్రోత్సాహానికి స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కృషి చేస్తోందన్నారు. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలన్నీ ఎపిఎస్‌డిసితో కలసిరావాలని పిలుపునిచ్చారు. కాగా, విద్యార్థుల్లో నైపుణ్యాల పెంపుదలకు పాఠ్యప్రణాళికల్లో తగిన మార్పులను తీసుకురావల్సిన అవసరం ఉందన్నారు. విద్యా సంస్థలు, పరిశ్రమల మధ్య అంతరం ఉందని, దీనిని అధిగమించడానికి కృషిచేయాలన్నారు. సాంకేతిక సమస్యలను తరగతి గదుల్లో ప్రవేశపెట్టిన కేస్ స్టడీస్ రూపంలో విద్యార్థులతో చర్చించగలిగితే, వారు అనే్వషణ మార్గం వైపు పయనించే అవకాశాలుంటాయని పేర్కొన్నారు. ఇందుకు ఉపాధ్యాయులు బహుముఖ పాత్ర పోషించాలని కోరారు. హ్యాండ్స్ ఆన్ ఎక్స్‌పీరియన్స్‌పై అవగాహన కలిగించినట్టయితే విద్యార్థులు పరిశ్రమలకు అనుగుణంగా తయారవుతారన్నారు. నైపుణ్యాల శిక్షణను ఆడిట్ కోర్సులుగా, మినీ ప్రాజెక్ట్‌లుగా, యాడ్ ఆన్ కోర్స్‌లుగా లేక అప్రెంటీస్‌షిప్ మాదిరిగా, ప్రాజెక్ట్‌లపరంగా ప్రవేశపెడితే మంచి ఫలితాలుంటాయని అభిప్రాయ పడ్డారు. సమీకృత విధానాలకు అధిక ప్రాధాన్యతనివ్వాలని, నైపుణ్యాల అభివృద్ధిపై శిక్షణ ఇచ్చే విధంగా విశ్వ విద్యాలయాలు పాఠ్య ప్రణాళికలను రూపొందించాలని సూచించారు. ఇది విజయవంతమైతే విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారని, విద్యార్థుల్లో అంతర్గత శక్తిని వెలికితీసేందుకు మార్గం సుగమం అవుతుందని అన్నారు. సభకు జెఎన్‌టియుకె విసి ఆచార్య విఎస్‌ఎస్ కుమార్ అధ్యక్షత వహించారు. వర్సిటీ ఆచార్య బి ప్రభాకరరావు, విభాగాధిపతులు, ప్రోగ్రాం డైరెక్టర్లు, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

చిత్రం..మాన్యుఫాక్చరింగ్ లేబొరేటరీని ప్రారంభిస్తున్న డాక్టర్ గంటా సుబ్బారావు