బిజినెస్

బెంగళూరులో ఐఫోన్ల అసెంబ్లింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, మార్చి 30: అంతర్జాతీయ ఐటి దిగ్గజ సంస్థ ఆపిల్ శరవేగంగా వృద్ధి చెందుతున్న భారత మార్కెట్‌లో తన ఉనికిని బలోపేతం చేసుకునేందుకు అవకాశాలను మెరుగుపర్చుకుంటోంది. ఇందులో భాగంగా ఈ సంస్థ నెల రోజుల్లోపే బెంగళూరులో తమ హై-ఎండ్ ఐఫోన్ల తయారీని మొదలు పెట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని కర్నాటక ఐటి శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే గురువారం వెల్లడించారు. ఆపిల్ సంస్థ నెల రోజుల్లోపే బెంగళూరులోని ప్లాంట్‌లో హై-ఎండ్ ఐఫోన్ల అసెంబ్లింగ్‌ను, తయారీని ప్రారంభించబోతోందని, ఈ విషయంలో ఆపిల్‌కు తైవాన్‌కు చెందిన కాంట్రాక్టు సంస్థ విస్ట్రన్ కార్పొరేషన్ సహాయ సహకారాలను అందజేయనుందని ప్రియాంక్ ఖర్గే ఇక్కడ పిటిఐ వార్తా సంస్థకు వివరించారు. భారత్‌లో ఐఫోన్లను తయారు చేయడం వలన వాటి ధరలు తగ్గి ఇక్కడి మార్కెట్‌లో ఆపిల్ తన ఉనికిని బలోపేతం చేసుకునేందుకు దోహదపడుతుందని ఆయన చెప్పారు.