బిజినెస్

పొగాకు బోర్డు సిఇఓగా వెంకటేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మార్చి 30: భారత పొగాకు బోర్డు తొలి సిఇఒగా ఐఎఎస్ అధికారి టి వెంకటేష్ గురువారం గుంటూరులోని బోర్డు ప్రధాన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఉత్తరప్రదేశ్ చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్‌గా వెంకటేష్ పనిచేశారు. 1988వ బ్యాచ్‌కు చెందిన వెంకటేష్ ఉత్తరప్రదేశ్ క్యాడర్ ఐఎఎస్ అధికారి. భారతపొగాకు బోర్డు ఆవిర్భావం నుంచి చైర్మన్‌గా ఐఎఎస్ అధికారిని నియమించడం ఆనవాయితీగా వచ్చింది. అయితే తాజాగా కేంద్రప్రభుత్వం పొగాకు బోర్డు చైర్మన్‌గా రాజకీయ నేతను నియమించే ప్రక్రియను చేపట్టిన నేపథ్యంలో బోర్డుకు కొత్తగా సిఇఒ పోస్ట్‌ను సృష్టించి, ఆ పోస్టుకు ఐఎఎస్ కేడర్ అధికారిని నియమించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ కేడర్‌కు చెందిన టి వెంకటేష్‌ను పొగాకుబోర్డు సిఇఒగా కేంద్రం నియమించింది. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన వెంకటేష్‌ను బోర్డు సభ్యులు జి సత్యనారాయణ, మాజీ సభ్యులు గద్దే శేషగిరిరావు, పలువురు అధికారులు, ఉద్యోగులు కలిసి అభినందనలు తెలిపారు.

చిత్రం..టుబాకో బోర్డు సిఇఓగా బాధ్యతలు స్వీకరించిన ఐఎఎస్ అధికారి వెంకటేష్