బిజినెస్

మార్కెట్లకు జిఎస్‌టి కళ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మార్చి 30: దేశమంతటా ఒకే రకమైన వస్తు సేవల పన్ను విధించడానికి సంబంధించిన జిఎస్‌టి బిల్లులకు లోక్‌సభ ఆమోదం వేయడం దేశీయ స్టాక్ మార్కెట్లకు బాగా కలిసొసిచ్చింది. డెరివేటివ్ కాంట్రాక్ట్‌ల గడువు ముగియడంతో పాటుగా జిఎస్‌టి అమలు అనుకున్న సమయంలో అమలులోకి వస్తుందన్న ఆశాభావం కారణంగా బిఎస్‌ఇ సెనె్సక్స్ 115.99 పాయింట్లు లేదా 0.39 శాతం బలపడి 29,647.42 పాయింట్లకు చేరగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజి సూచీ నిఫ్టీ 9,173.75 పాయింట్ల స్థాయికి చేరుకుని సరికొత్త రికార్డును సృష్టించింది. నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజి సూచీ నిఫ్టీ సైతం 30 పాయింట్లు పెరిగి 9,173.75 పాయింట్ల సరికొత్త గరిష్ఠస్థాయికి చేరుకుంది. జిఎస్‌టి బిల్లుల ఆమోదంతో పాటుగా విదేశీ పెట్టుబడుల వరద కొనసాగుతుండడం కూడా మదుపరులలో కొత్త ఉత్సాహాన్ని నింపి మార్చి నెల డెరివేటివ్ కాంట్రాక్ట్‌ల చివరి రోజున కొనుగోళ్ల వైపు మొగ్గేలా చేసిందని మార్కట్ వర్గాలు అంటున్నాయి. ఫలితంగా ఆష్రియా లిమిటెడ్, ఆల్‌కార్గో లాజిస్టిక్స్, ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, బ్లూడార్ట్ ఎక్స్‌ప్రెస్, స్నోమ్యాన్ అండ్ కంటైనర్ కార్పొరేషన్ తదితర లాజిస్టిక్ కంపెనీల షేర్లు మంచి లాభాలు ఆర్జించాయి. మరోవైపు అదానీ పోర్ట్స్ షేర్ 5.77 శాతం పెరగ్గా, హెచ్‌డిఎఫ్‌సి, భారతీ ఎయిర్‌టెల్, గెయిల్, రిల్, విప్రో, సిప్లా, ఎస్‌బిఐ, హిందుస్థాన్ యూనిలీవర్, ఎల్‌అండ్‌టి షేర్లు కూడా మంచి లాభాలు ఆర్జించాయి. నిన్న భారీగా నష్టపోయిన ఆటో షేర్లు ఈ రోజు కాస్త కోలుకున్నాయి. కాగా, ప్రధాన ఆసియా మార్కెట్లు నష్టాల్లో ముగియగా, ఐరోపా మార్కెట్లు మాత్రం ప్రారంభంలో కాస్త హుషారుగా మొదలైనాయి.