బిజినెస్

ఆర్థిక సంస్కరణలు ఆగవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 31: వౌలిక రంగంలో పెట్టుబడులను ఆకర్షించడానికి, దేశ జిడిపి వృద్ధిరేటును పరుగులు పెట్టించడానికి మున్ముందు మరిన్ని ఆర్థిక సంస్కరణలు ఉంటాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. ‘్భరత్‌లో మా సంస్కరణల ప్రక్రియ కొనసాగుతోంది. గడచిన రెండేళ్ల కాలం నుంచి వేగంగా సంస్కరణల అమలును చేపడుతున్నాం. రాబోయే రెండేళ్లూ ఇదే జోరును కొనసాగిస్తాం.’ అని శుక్రవారం ఇక్కడ యూరోపియన్ ఇనె్వస్ట్‌మెంట్ బ్యాంక్ (ఇఐబి) శాశ్వత కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా స్పష్టం చేశారు. నేడు ప్రపంచ దేశాల్లో భారత ఆర్థిక వ్యవస్థ అత్యంత ఆకర్షణీయంగా ఉందన్నారు. ఇదిలావుంటే దేశీయంగా చేపడుతున్న వివిధ ప్రాజెక్టులకు 450 మిలియన్ యూరోల సాయాన్ని యూరోపియన్ ఇనె్వస్ట్‌మెంట్ బ్యాంక్ ప్రకటించింది. సోలార్ పవర్ ప్రాజెక్టుల కోసం ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ)కు 1,400 కోట్ల రూపాయల రుణాన్ని కూడా ఈ సందర్భంగా యూరోపియన్ ఇనె్వస్ట్‌మెంట్ బ్యాంక్ ఆమోదించింది.

చిత్రం.. ఇఐబి శాశ్వత కార్యాలయం ప్రారంభోత్సవంలో మాట్లాడుతున్న జైట్లీ