బిజినెస్

హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో ‘ప్యాసింజర్ ఈజ్ ప్రైమ్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 1: రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు కార్యకలాపాలు నిర్వహిస్తున్న జిఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్సు లిమిటెడ్ (జిహెచ్‌ఐఎల్) ‘ప్యాసింజర్ ఈజ్ ప్రైమ్’ను శనివారం ప్రారంభించింది. ప్రపంచ స్థాయి సౌకర్యాలను అందిస్తూ గుర్తింపు పొందిన రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణీకులను ఆకట్టుకునే విధంగా ‘ప్యాసింజర్ ఈజ్ ప్రైమ్’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు జిఎంఆర్ తెలిపింది. దీనిలో భాగంగా ప్రయాణీకులకు సేవలు అందించేందుకు ప్యాసింజర్ సర్వీస్ అసోసియేట్ (పిఎస్‌ఏఎస్)లను నియమించినట్లు తెలిపింది. దాదాపు 50 మంది పిఎస్‌ఏఎస్‌లను నియమించడం ద్వారా విమానాశ్రయ టెర్మినల్‌లో ప్యాసింజర్లకు సహాయపడేందుకు ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. చెక్ ఇన్ ఏరియా, ట్రాన్స్‌ఫర్స్ ఏరియా, సెక్యూరిటీ హోల్డ్, బోర్డింగ్ ఏరియాల్లో వీరు పని చేస్తారని జిఎంఆర్ తెలిపింది. జిహెచ్‌ఐఎఎల్ సిఈఓ ఎస్‌జికె కిషోర్ మాట్లాడుతూ ప్రయాణీకులకు అత్యుత్తమ సేవలను అందించేందుకు ఉద్దేశించి ఈ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.