బిజినెస్

మైల్డ్ హైబ్రిడ్ వాహనాలకు ‘ఫేమ్’ రాయితీల ఉపసంహరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 2: ఫేమ్ ఇండియా పథకం కింద మైల్డ్ హైబ్రిడ్ వాహనాలకు ఇస్తున్న రాయితీలను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది. దీంతో దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఇండియాకు తీవ్రమైన నష్టం వాటిల్లనుంది. దేశంలో పర్యావరణానికి హాని కలిగించని వాహనాలను ప్రోత్సహించాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2015 ఏప్రిల్‌లో ఫేమ్ ఇండియా పథకాన్ని ప్రారంభించి, దీని కింద ఎలక్రిక్, హైబ్రిడ్ టెక్నాలజీలతో రూపొందించిన బైకులు, కార్లు రూ.29 వేల నుంచి రూ.1.39 లక్షల వరకు రాయితీలు ఇస్తున్న విషయం తెలిసిందే. మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీతో మారుతీ సుజుకీ తయారు చేస్తున్న మల్టీ యుటిలిటీ వెహికల్ (ఎంయువి) ఎర్టిగా, మిడ్-సైజ్డ్ సెడాన్ సియాజ్ లాంటి అత్యంత ప్రజాదరణ పొందిన కార్లకు ఫేమ్ ఇండియా పథకం ద్వారా ఎంతో ప్రయోజనం చేకూరుతోంది. అయితే ఈ నెల 1వ తేదీ నుంచి మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీ వాహనాలను ఫేమ్ ఇండియా పథకానికి సంబంధించిన రాయితీల నుంచి తొలగిస్తున్నట్లు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే రిటైల్ కొనుగోలుదారులకు డీలర్లు మార్చి 31వ తేదీ వరకు అమ్మిన మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీ వాహనాలకు దీని వలన ఎటువంటి నష్టం ఉండదని ఆ నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది. అలాగే ఫేమ్ ఇండియా పథకం తొలి దశను సెప్టెంబర్ 30వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు భారీ పరిశ్రమల శాఖ ఈ నోటిఫికేషన్‌లో వెల్లడించింది.