బిజినెస్

దుమ్మురేపిన ఆటో అమ్మకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 3: దేశీయ ఆటోరంగ అమ్మకాలు గత ఆర్థిక సంవత్సరం (2016-17)లో భారీగా నమోదయ్యాయి. మారుతి సుజుకి 9.8 శాతం వృద్ధితో 15,68,603 యూనిట్లను విక్రయించగా అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2015-16)లో 14,29,248 యూనిట్లను అమ్మింది. టాటా మోటార్స్ విక్రయాలు 5,11,705 యూనిట్ల నుంచి 5,42,561 యూనిట్లకు పెరిగాయి. హ్యుందాయ్ మోటార్ అమ్మకాలు కూడా 4,84,324 యూనిట్ల నుంచి 5,09,707 యూనిట్లకు ఎగిశాయి. మహీంద్ర అండ్ మహీంద్ర విక్రయాలూ 4,94,098 యూనిట్ల నుంచి 5,06,625 యూనిట్లకు ఎగబాకాయి. ఇక టొయోట అమ్మకాలు 2016-17లో 1,42,500 యూనిట్లుగా ఉంటే, 2015-16లో 1,28,500 యూనిట్లుగా ఉన్నాయి. నిస్సాన్ మోటార్ అమ్మకాలు కూడా 2016-17లో 57,315 యూనిట్లుగా ఉంటే, 2015-16లో 39,393 యూనిట్లకే పరిమితమయ్యాయి. రెనాల్ట్ ఇండియా విక్రయాల విషయానికొస్తే 88.4 శాతం వృద్ధితో 71,732 యూనిట్ల నుంచి 1,35,123 యూనిట్లకు చేరుకున్నాయి. ద్విచక్ర వాహన విభాగంలో దేశీయ దిగ్గజం హీరో మోటోకార్ప్ మునుపెన్నడూ లేనివిధంగా అత్యుత్తమ స్థాయలో 2016-17లో 66,63,903 యూనిట్ల అమ్మకాలు జరపగా, 2015-16లో 66,32,322 యూనిట్ల విక్రయాలు జరిపింది. హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా అమ్మకాలు కూడా 11.7 శాతం వృద్ధిరేటును నమోదు చేశాయ. 50 లక్షల మార్కును అధిగమించినట్లు సోమవారం సంస్థ ప్రకటించింది. 2016-17లో 50,08,103 యూనిట్ల అమ్మకాలు జరిగితే, 2015-16లో 44,83,462 యూనిట్ల విక్రయాలుగానే ఉన్నాయ. కాగా, రాయల్ ఎన్‌ఫిల్డ్ అమ్మకాలు గత ఆర్థిక సంవత్సరం 6,66,490 యూనిట్లుగా ఉంటే, అంతకుముందు ఆర్థిక సంవత్సరం 5,08,154 యూనిట్లుగా ఉన్నాయి. వాతావరణంలో ప్రమాదకర స్థాయకి చేరిన కర్బన ఉద్గారాల నియంత్రణకుగాను బిఎస్-3 వాహనాల అమ్మకాలు, రిజిస్ట్రేషన్లపై ఈ నెల 1 నుంచి సుప్రీం కోర్టు నిషేధం విధించిన క్రమంలో మిగిలిపోయన ఆ వాహనాల అమ్మకాల కోసం ప్రకటించిన డిస్కౌంట్ ఆఫర్లు టూవీలర్ సేల్స్‌ను గత ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయకి చేర్చాయ.