బిజినెస్

రాబోయే మూడేళ్లలో 8-10 శాతానికి దేశ జిడిపి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, ఏప్రిల్ 23: రాబోయే మూడేళ్లలో భారత జిడిపి వృద్ధిరేటు 8-10 శాతాన్ని అందుకోగలదన్న విశ్వాసాన్ని ముఖ్య ఆర్థిక సలహాదారు అర్వింద్ సుబ్రమణ్యన్ వ్యక్తం చేశారు. ‘్ఫబ్రవరిలో మేము విడుదల చేసిన ఆర్థిక సర్వేలో దేశ జిడిపి వృద్ధిరేటు 7-7.75 శాతం మధ్య ఉంటుందని అంచనా వేశాం. మూడేళ్లలో ఇది 8-10 శాతం వృద్ధికి ఎగబాకుతుంది.’ అన్నారు. శనివారం ఇక్కడ జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన సుబ్రమణ్యన్ విలేఖరులతో మాట్లాడారు. కాగా, భారత్, చైనాల మధ్య పరిపాలనలో ఉన్న వ్యత్యాసాలపై మాట్లాడుతూ ఇరు దేశాల్లో రాజకీయపరమైన పాలన వేర్వేరుగా ఉందని, అయితే ఆర్థిక వ్యవహారాలు మాత్రం భారత్‌తో పోల్చితే చైనాలో బాగున్నాయన్నారు. వౌలిక రంగాభివృద్ధికి చైనాలోని కమ్యూనిస్టు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, అందుకే అక్కడ భారీ పెట్టుబడులున్నాయన్నారు.