బిజినెస్

12వేల ఉద్యోగుల్లో విఆర్‌ఎస్ తీసుకున్నది 2,800 మందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఏప్రిల్ 3: ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ)లో విలీనమైన ఐదు అనుబంధ బ్యాంకుల్లో ఇప్పటిదాకా 2,800 ఉద్యోగులు మాత్రమే స్వచ్చంధ పదవీ విరమణ (విఆర్‌ఎస్) పథకాన్ని ఎంచుకున్నారని ఎస్‌బిఐ చైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య సోమవారం తెలిపారు. నిజానికి 12,000 మందికిపైగా విఆర్‌ఎస్‌కు అర్హులుగా ఉన్నారని ఆమె చెప్పారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్ (ఎస్‌బిబిజె), స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్‌బిహెచ్), స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ (ఎస్‌బిఎమ్), స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాల (ఎస్‌బిపి), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావన్‌కోర్ (ఎస్‌బిటి) బ్యాంకులు ఎస్‌బి ఐలో విలీనమైనది తెలిసిందే.
వీటితోపాటు భారతీయ మహిళా బ్యాంక్ (బిఎమ్‌బి) కూడా విలీనమవగా, ఈ నెల 1 నుంచే ఈ విలీనాలు అమల్లోకి వచ్చాయి. ఈ క్రమంలో అనుబంధ బ్యాంకులకు చెందిన దాదాపు 12,500 మంది ఉద్యోగులకు ఎస్‌బిఐ విఆర్‌ఎస్‌ను ప్రకటించింది. ఈ నెల 5 వరకు ఈ పథకం అందుబాటులో ఉంటుంది. కాగా, విలీనం తర్వాత నిరర్థక ఆస్తుల (ఎన్‌పిఎ లేదా మొండి బకాయిలు)పై చెప్పుకోదగ్గ ప్రతికూలత కనబడకపోవచ్చన్నారు.
మరోవైపు సేవింగ్స్ ఖాతాల్లో కనీసం 5,000 రూపాయల నగదు ఉండాలన్న నిబంధనతోపాటు, ఇతరత్రా చార్జీలు సోమవారం నుంచి అమల్లోకి వచ్చాయి. ఇదిలావుంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) ద్రవ్యసమీక్షకు ముందు ఎస్‌బిఐ తమ బెంచ్‌మార్క్ లెండింగ్ రేటును తగ్గించింది. 15 బేస్ పాయింట్లు కోత విధించి 9.10 శాతానికి తీసుకొచ్చింది.
దీంతో రుణాలపై వడ్డీరేట్లు దిగిరాగా, రుణగ్రహీతల నెలసరి వాయిదా చెల్లింపుల (ఇఎమ్‌ఐ) భారం తగ్గనుంది. ఈ నెల 1 నుంచే తగ్గిన వడ్డీరేట్లు అమల్లోకి వస్తాయని ఎస్‌బిఐ తెలిపింది. కాగా, మార్జినల్ కాస్ట్ ఆధారిత లెండింగ్ రేటు (ఎమ్‌సిఎల్‌ఆర్)ను మాత్రం 8 శాతం వద్దే ఉంచింది. ఇకపోతే విదేశీ ప్రయాణ ప్రీ-పెయిడ్ కార్డుల కోసం కాక్స్ అండ్ కింగ్స్‌తో ఎస్‌బిఐ భాగస్వామ్యాన్ని ఏర్పరుచుకుంది.