బిజినెస్

3 వేల కోట్ల నష్టం: క్రిసిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 3: బిఎస్-3 వాహనాలపై సుప్రీం కోర్టు విధించిన నిషేధం విలువ 3 వేల కోట్ల రూపాయలుగా ఉంటుందని మార్కెట్ రిసెర్చ్ సంస్థ క్రిసిల్ అంచనా వేసింది. వాతావరణంలో కర్బన ఉద్గారాల స్థాయి ప్రమాదకర స్థితికి చేరుకున్న నేపథ్యంలో బిఎస్-3 వాహనాల అమ్మకాలు, రిజిస్ట్రేషన్లపై ఈ నెల 1 నుంచి నిషేధం విధిస్తున్నట్లు గత నెల మార్చి 29న అత్యున్నత న్యాయస్థానం తీర్పు చెప్పినది తెలిసిందే. దీంతో 8 లక్షలకుపైగా ఉన్న బిఎస్-3 ప్రమాణాల వాహనాలను ఈ తీర్పు ప్రభావితం చేయగా, ఇందులో 6 లక్షలకుపైగా ఉన్నవి ద్విచక్ర వాహనాలే. అయితే డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటించి మార్చి 30, 31 తేదీల్లో ద్విచక్ర వాహన తయారీదారులు తమ వాహనాలను అమ్మేసుకున్నారు.
అయినప్పటికీ 460-480 కోట్ల రూపాయల నష్టాన్ని టూవీలర్ కంపెనీలు చవిచూశాయని క్రిసిల్ అంచనా వేసింది. మరోవైపు వాణిజ్య వాహనాలకు 2,500 కోట్ల రూపాయల వరకు నష్టం వాటిల్లిందని చెప్పింది. ప్యాసింజర్ వాహనాలు పెద్దగా లేవన్నది తెలిసిందే.