బిజినెస్

‘ కేపిటల్ గెయిన్స్ ట్యాక్స్ రద్దు చేయాలి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఏప్రిల్ 4: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రియల్ ఎస్టేట్ క్రమబద్ధీకరణ చట్టం నేపథ్యంలో స్టాంపు డ్యూటీలను తగ్గించి, భూమి విలువను మార్కెట్ ధరలకు దగ్గరగా పెంచాలని కోరుతున్నట్లు కాన్ఫడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (క్రెడాయ్) ఎపి స్టేట్ ఉపాధ్యక్షుడు బుడ్డిగ శ్రీనివాస్ తెలిపారు. కేపిటల్ గెయిన్స్ ట్యాక్స్ రద్దు చేస్తే అర్బన్ ప్రాంతాల్లో భూమి లభ్యత పెరుగుతుందన్న ఆయన కేంద్ర, రాష్ట్ర చట్టాల మధ్య సమన్వయం ఉండాలన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మంగళవారం ఆయన విలేఖరులతో మాట్లాడారు. కొనుగోలుదారుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ క్రెడాయ్ సంస్థ విశ్వసనీయతను పెంపొందించుకుందని, ఈ నెల 8,9 తేదీల్లో అహ్మదాబాద్‌లో క్రెడాయ్ జాతీయ స్థాయి సదస్సు జరగనుందని, ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరవుతున్న కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు దృష్టికి వివిధ సమస్యలను తీసుకెళ్తామన్నారు. కాగా, పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ స్తబ్ధుగా మారిందని, అయతే నగరాలు, పట్టణాల్లో ధరలు ఏ మాత్రం తగ్గలేదన్నారు. అర్బన్ ప్రాంతాల్లో వలసలు పెరుగుతుండటం వల్ల అపార్టుమెంట్లకు గిరాకీ ఉందన్నారు. రియల్ ఎస్టేట్ క్రమబద్ధీకరణ చట్టం మే ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానుందని, కేంద్ర ప్రభుత్వ చట్టానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం అథారిటీ, ట్రిబ్యునల్ ఏర్పాటుచేస్తూ చట్టానికి రూపకల్పన చేసిందన్నారు. దీనివల్ల నిర్మాణ రంగంలో పారదర్శకత పెరుగుతుందన్న ఆయన కొత్త భవన నిర్మాణ నిబంధనల్లో ఎపి స్టేట్ విద్యుత్ ఆదా, పర్యావరణ పరిరక్షణ, సోలార్ సిస్టమ్ తదితర అంశాలను అమల్లోకి తేవడం స్వాగతిస్తున్నామన్నారు.