బిజినెస్

ఎడా పెడా బాదుడే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 4: దాదాపు అయిదేళ్ల విరామం తర్వాత స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బిఐ) ఖాతాల్లో కనీస నగదు నిల్వలను కొనసాగించని పక్షంలో పెనాల్టీ విధించడాన్ని తిరిగి ప్రవేశపెట్టింది. ఏప్రిల్ 1నుంచి ఇది అమలులోకి వచ్చింది. దీనికి తోడు ఎటిఎంలతో పాటుగా ఇతర సర్వీసు చార్జీలను సైతం పెంచింది. ఇకపై ఎస్‌బిఐలో పరిమితికి మించి అందించే ప్రతి సేవకూ చార్జీ వసూలు చేస్తారు. ఎస్‌బిఐతో పాటుగా ఆ బ్యాంకులో విలీనమైన అయిదు అనుబంధ బ్యాంకుల్లో ఖాతాలు కలిగి ఉన్న వారికి కూడా సవరించిన చార్జీలు వర్తిస్తాయి. ఇకపై స్టేట్ బ్యాంక్ సేవింగ్స్ ఖాతాల్లో కనీస నగదు నిల్వ 5 వేలు లేకపోతే పెనాల్టీ విధిస్తారు. కరెంట్ ఖాతాల విషయానికి వస్తే ఈ మొత్తం 20 వేలు ఉండాలి. అలాగే సేవింగ్ ఖాతాలు కలిగిన వారు నెలలో మూడుసార్లు మాత్రమే ఉచితంగా నగదు డిపాజిట్ చేయడానికి అనుమతిస్తారు. ఆ తర్వాత ప్రతి లావాదేవీకి 50 రూపాయల పెనాల్టీతో పాటుగా సర్వీస్ టాక్స్ కూడా విధిస్తారు.
అలాగే ఇకపై ఒన్‌టైమ్ లాకర్ రిజిస్ట్రేషన్ చార్జీ ఇకపై చిన్న, మధ్య స్థాయి లాకర్లకైతే రూ. 500లు, పెద్ద లాకర్లకయితే రూ వెయ్యి ఉంటుంది. దీనికి సర్వీస్ టాక్స్ అదనం. ఇక లాకర్ కీ పోగొట్టుకున్నా, లాకర్ రెంట్ చెల్లించకున్నా వెయ్యి రూపాయల పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఇది కాకుండా లాకర్‌ను పగులగొట్టడానికి అయిన ఖర్చు, తాళం మార్చడానికి అయిన ఖర్చును కూడా ఖాతాదారులనుంచి వసూలు చేస్తారు. అలాగే 12 సార్ల వరకు ఉచిత లాకర్ లాకర్ విజిట్లను అనుమతిస్తారు. దానికి మించితే ప్రతి విజిట్‌కు వందరూపాయలకు తోడు సర్వీస్ చార్జీని వసూలు చేస్తారు.