బిజినెస్

ఐఐపి, ద్రవ్యోల్బణం కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 9: ఈ వారం దేశీయ స్టాక్ మార్కెటను ఐఐపి, ద్రవ్యోల్బణం గణాంకాలు, త్రైమాసిక ఆర్థిక ఫలితాలు నడిపిస్తాయని నిపు ణులు అంచనా వేస్తున్నారు. ఫిబ్రవరి నెలకుగాను పారిశ్రామికో త్పత్తి (ఐఐపి) గణాంకాలు, మార్చి నెలకు గాను వినియోగదారుల ధరల సూచీ (సిపిఐ) ద్రవ్యోల్బణం గణాంకాలు బుధవారం విడుదలవుతున్నాయ. అలాగే గత నెల మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికి (జనవరి-మార్చి)గాను ప్రభుత్వ, ప్రైవేట్‌రంగ సంస్థలు తమ ఆర్థిక ఫలితాలను విడుదల చేయనుం డటంతో మదుపరులు వీటి ప్రకారం పెట్టుబడులపై నిర్ణయాలు తీసుకుం టారని చెబుతున్నారు. కాగా, సిరియా పై అమెరికా క్షిపణి దాడులతో తలెత్తిన యుద్ధ భయాలు కూడా స్టాక్ మార్కెట్ తీరుతెన్నులను నిర్దేశిస్తా యని అంటున్నారు. గురువారం దేశీయ ఐటిరంగ దిగ్గజాల్లో ఒకటైన ఇన్ఫోసిస్ జనవరి-మార్చి త్రైమాసిక ఆర్థిక ఫలితాలను విడుదల చేయనుంది. దీంతో తప్పక దీని ప్రభావం ట్రేడింగ్ సరళిపై ఉంటుం దని నిపుణులు చెబుతున్నారు. శుక్రవారం అంబేద్కర్ జయంతి, గుడ్ ఫ్రైడే సందర్భంగా మార్కెట్లకు సెలవు కావడంతో ఈ వారం కూడా నాలుగు రోజులే స్టాక్ మార్కెట్లు పనిచేయనున్నాయ. గత వారం శ్రీరామ నవమి సందర్భంగా మంగళ వారం సెలవు కావడంతో నాలుగు రోజులే ట్రేడింగ్ నడిచినది తెలిసిందే. ఇక ఎప్పట్లాగే డాలర్‌తో పోల్చితే రూపాయ మారకం విలువ, విదేశీ మదుపరుల పెట్టుబడులు, గ్లోబల్ స్టాక్ మార్కెట్ల కదలికలు, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు భారతీయ స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్‌ను ప్రభావితం చేయనున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.