బిజినెస్

జియోని ఎ1కు భలే డిమాండ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 10: స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ జియోని.. తమ నూతన మోడల్ ఎ1 స్మార్ట్ఫోన్‌కు 10 రోజుల్లో దాదాపు 150 కోట్ల రూపాయల విలువైన ఆర్డర్లు వచ్చాయని సోమవారం తెలిపింది. ఈ ఏడాదిలో తాము మార్కెట్‌కు పరిచయం చేసిన తొలి స్మార్ట్ఫోన్ ఎ1 అని, ఈ నెల 9 వరకు దీని కోసం 150 కోట్ల రూపాయల విలువైన బుకింగ్స్ జరిగాయని చెప్పింది. మొత్తం 74,682 మొబైల్స్‌కు ఆర్డర్లు అందుకున్నామని జియోని ఇండియా సిఇఒ, ఎండి అర్వింద్ ఆర్ వోహ్రా పిటిఐతో అన్నారు. 8,000- 25,000 రూపాయల ధరల శ్రేణిలో మరే ఇతర ఫోన్‌కు కూడా ఈ స్థాయిలో ప్రీ-బుకింగ్స్ నమోదు కాలేదని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. కాగా, 19,999 రూపాయల విలువ కలిగిన జియోని ఎ1లో 16 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాతోపాటు డ్యూయెల్ టోన్ ఫ్లాష్ టెక్నాలజీ ఉన్నాయి. అలాగే మీడియాటెక్ పి10 ప్రాసెసర్, 4జిబి ర్యామ్, 64జిబి అంతర్గత మెమరీ సామర్థ్యం, 4010 మెగాహెట్జ్ బ్యాటరీ దీని సొంతం. ముందు గా 2,000 రూపాయలను చెల్లించి కావాల్సినవారు ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకోవచ్చని వోహ్రా చెప్పారు.