బిజినెస్

రూ. 43 వేల కోట్లు ఎలా వసూలు చేద్దాం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 23: తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) 43,115 కోట్ల రూపాయలను వసూలు చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఈ భారీ లక్ష్యాన్ని సాధించేందుకు వాణిజ్య పన్నుల శాఖ ఇప్పుడు కుస్తీ పడుతోంది. మిగిలిన అన్ని శాఖల కన్నా వాణిజ్య పన్నుల శాఖలో వృద్ధి అధికంగా ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరం 43 వేల కోట్ల రూపాయలకుపైగా లక్ష్యం నిర్ణయించారు. ఈ నేపథ్యంలో లక్ష్యాన్ని సాధించేందుకు వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆ శాఖ ఉన్నతాధికారులతో శనివారం ఇక్కడ సమావేశం నిర్వహించారు. కొన్ని సంస్కరణలు చేపట్టి, పనితీరులో మార్పు చూపిస్తే, లక్ష్యాన్ని సాధించవచ్చునని ఈ సందర్భంగా అధికారులు తెలిపారు. గత ఆర్థిక సంవత్సరం (2015-16)లో వాణిజ్య పన్నుల శాఖ 96 శాతం లక్ష్యాన్ని సాధించింది. 33,965 కోట్ల రూపాయల వసూళ్లకుగాను 32,492 కోట్ల రూపాయలు వసూలు చేశారు. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2014-15)లో పది నెలల్లో 23,728 కోట్ల రూపాయల వసూళ్లను సాధించారు. కాగా, వాణిజ్య పన్నుల శాఖ గత ఆర్థిక సంవత్సరం సాధించిన ఆకర్షణీయమైన ఫలితాలకుగాను ముఖ్య కార్యదర్శిని, కమీషనర్‌ను శాఖలోని ఉన్నతాధికారులను, ఉద్యోగులను ఈ సమావేశంలో మంత్రి అభినందించారు. అందరం సమష్ఠిగా కృషి చేయడం వల్లనే ఈ విజయం సాధ్యమైందని అన్నారు. మరోవైపు స్ట్రీట్ సర్వేలు నిర్వహించి కొత్తగా రిజిస్ట్రేషన్లు ఇవ్వాలని నిర్ణయించారు. శాస్ర్తియ పద్ధతిలో టెక్నాలజీని వాడుకుని ఆడిట్‌లు నిర్వహించనున్నారు. సరకు రవాణా విషయంలో లోపాలు నెలకొన్న నేపథ్యంలో కోల్పోతున్న పన్ను ఆదాయాన్ని ట్రాన్స్‌పోర్ట్ నిర్వాహకులపై దృష్టి సారించి రాబట్టాల్సిన అవసరముందని మంత్రి అభిప్రాయపడ్డారు. అలాగే గోదాముల తనిఖీ ద్వారా లీకేజీని అరికట్టాలని నిర్ణయించారు. ఇక చెక్‌పోస్టుల వసతుల అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నట్లు మంత్రి తెలిపారు. చెక్ పోస్టులను ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులుగా మార్చటానికి ప్రభుత్వం నిర్ణయించిందని తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.