బిజినెస్

దేశీయ స్టాక్ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఏప్రిల్ 10: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 130.87 పాయింట్లు క్షీణించి 29,575.74 వద్ద స్థిరపడగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 16.85 పాయింట్లు కోల్పోయి 9,181.45 వద్ద నిలిచింది. గత ఆర్థిక సంవత్సరం (2016-17) చివరి త్రైమాసికానికి (జనవరి-మార్చి)గాను ప్రభుత్వ, ప్రైవేట్‌రంగ సంస్థలు తమ ఆర్థిక ఫలితాలను వెల్లడించనున్న క్రమంలో మదుపరులు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యారు. సిరియాపై అమెరికా క్షిపణి దాడులు కూడా మదుపరులను లాభాల స్వీకరణ వైపు నడిపించాయి. ఇక మంగళవారం ఫిబ్రవరి నెలకుగాను పారిశ్రామికోత్పత్తి (ఐఐపి) గణాంకాలు వెలువడుతుండటం, బుధవారం మార్చి నెలకుగాను వినియోగదారుల ధరల సూచీ (సిపిఐ) ఆధారిత ద్రవ్యోల్బణం గణాంకాలు విడుదల కానుండటం కూడా మదుపరులను కొత్త పెట్టుబడులపై పునరాలోచింపజేశాయని మార్కెట్ వర్గాలు ట్రేడింగ్ సరళిని విశే్లషిస్తున్నాయి.
గురువారం దేశీయ ఐటిరంగ దిగ్గజాల్లో ఒకటైన ఇన్ఫోసిస్ తమ జనవరి-మార్చి త్రైమాసిక ఆర్థిక ఫలితాలను తొలుత ప్రకటిస్తోంది. దీంతో ఆ ప్రభావం ట్రేడింగ్ సరళిపై తప్పకు చూపిస్తుందని నిపుణులు అంటున్నారు. ఇక ఆసియా మార్కెట్లలో జపాన్ మినహా కీలక సూచీలు నష్టాల్లో ముగియగా, ఐరోపా మార్కెట్లలోనూ ప్రధాన సూచీలు బలహీనంగానే కదలాడాయి.
డి-మార్ట్ షేర్ల జోరు
న్యూఢిల్లీ: రిటైల్ సూపర్ మార్కెట్ దిగ్గజం డి-మార్ట్ నిర్వహణదారైన అవెన్యూ సూపర్‌మార్ట్స్ మార్కెట్ విలువ సోమవారం ట్రేడింగ్ సమయంలో ఒకానొక దశలో 50,000 కోట్ల రూపాయల మార్కును అధిగమించింది. 3.33 శాతం వృద్ధితో 775.50 రూపాయల వద్ద ముగిసిన అవెన్యూ సూపర్‌మార్ట్స్ షేర్ విలువ.. ఇంట్రా-డే ట్రేడింగ్‌లో 806.80 రూపాయలను తాకింది. దీంతో ఒక్కసారిగా సంస్థ మార్కెట్ విలువ 50,351 కోట్ల రూపాయలను చేరింది. అయితే ట్రేడింగ్ ముగిసే సమయానికి 48,397.75 కోట్ల రూపాయల వద్ద నిలిచింది. అవెన్యూ సూపర్‌మార్ట్స్.. గత నెల మార్చి 21న స్టాక్ మార్కెట్లలోకి ఘనంగా ప్రవేశించినది తెలిసిందే. 299 రూపాయల వద్ద లిస్టయిన షేర్ విలువ మదుపరుల కొనుగోళ్ల జోరుతో ఒక్కరోజే 114 శాతానికిపైగా పెరిగింది. కేవలం మూడు వారాల్లోనే 376 రూపాయల మేర ఎగిసింది.